Tue. Apr 21st, 2026

కోలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్స్ లో ఒకరైన థలపతి విజయ్ ఇప్పుడు రాజకీయాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది తమిళనాట జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో విజయ్ పోటీ చేస్తున్నారు. అయితే ఈ ఎన్నికల నిమిత్తం చేస్తున్న ప్రచారంలో విజయ్ పెట్టిన భారీ సభలు, మీటింగ్ లలో తొక్కిసలాట కూడా జరిగింది. ఇక ఇదిలా ఉండగా తాజాగా కొన్ని షాకింగ్ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇందులో విజయ్ కి కొద్దిపాటిలో ప్రమాదం తప్పింది అని చెప్పాలి. మన స్టార్స్ ఏవైనా మీటింగ్ లు అటెండ్ అయితే అక్కడ విజువల్స్ ని డ్రోన్ కెమెరాతో బంధించడం ఎప్పుడు నుంచో కొనసాగుతుంది. అయితే ఈ డ్రోన్ ఆపరేటింగ్ మూలానే విజయ్ కి దాదాపు ప్రాణం మీదకి వచ్చిన ప్రమాదమే తప్పింది అనుకోవచ్చు.

తాజాగా తాను ప్రచారం చేస్తున్న చోట చిన్న ఇరుకుల్లో తన మీదుగా డ్రోన్ కెమెరాని ఆపరేట్ చేస్తున్నారు. అయితే అది అలా విజయ్ ముఖం, మెడ వరకు వెళ్ళసాగింది. దీనితో విజయ్ కూడా వెంటనే అప్రమత్తమయ్యారు. పక్కన ఉన్న తన సిబ్బంది మరియు సెక్యూరిటీ ఆ డ్రోన్ ని చేత్తో గట్టిగా కొట్టి పక్కకి తోసేసాయంతో అది కింద పడింది.

డ్రోన్స్ తాలూకా ఫ్యాన్స్ చాల పవర్ఫుల్ గా హై స్పీడ్ లో రొటేట్ అవుతాయి. ఆ స్పీడ్ లో పొరపాటుగా విజయ్ ముఖానికో ఇతర సున్నిత ప్రదేశాల్లో తగిలే అవకాశం అక్కడ ఉంది. ఇక్కడ ఏమాత్రం చిన్న ఆలస్యం అయినా దాని ప్రభావం చాలా పెద్దది అయ్యి ఉండేది. దీనితో విజయ్ అభిమానులు సోషల్ మీడియాలో ఆ డ్రోన్ ఆపరేటర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

The submit థలపతి విజయ్ కి తృటిలో తప్పిన ప్రమాదం.. వీడియో విజువల్స్ వైరల్ first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.