మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఇపుడు తన కెరీర్ 16వ చిత్రాన్ని దర్శకుడు బుచ్చిబాబు సానాతో చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ దీని తర్వాత అసలు ప్రాజెక్ట్ బుచ్చిబాబు గురువు, దర్శకుడు సుకుమార్ తో భారీ చిత్రం చరణ్ కెరీర్ 17వ సినిమాగా చేయనున్నాడు. అయితే ఈ చిత్రం అనౌన్సమెంట్ నుంచే సాలిడ్ బజ్ ని సొంతం చేసుకుంది.
ఈ నేపథ్యంలో పెద్ది రిలీజ్ తర్వాత చరణ్ అసలు పెద్దగా గ్యాప్ నే తీసుకోకుండా తన 17వ సినిమా మొదలు పెట్టేయాలని చూస్తున్నట్టు ఇపుడు తెలుస్తుంది. పెద్ది చిత్రం ఆల్రెడీ జూన్ విడుదల అని అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా విడుదల తర్వాత జూన్ లోనే సుకుమార్ తో సినిమా షూటింగ్ ని కూడా మొదలు పెట్టేయనున్నాడట. సో ఈ చిత్రం విషయంలో అభిమానులకి సాలిడ్ అప్డేట్ ఇది అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో నిర్మాణం వహించనున్నారు./
The put up RC 17: గ్యాప్ లేకుండా చరణ్ ప్లానింగ్.. ఈ నెల నుంచే సుకుమార్ తో స్టార్ట్! first seemed on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Scores.
