సాయి సింహాద్రి హీరోగా నటించి, నిర్మించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘సన్ ఆఫ్’ చిత్రం డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌పై సందడి చేస్తోంది. బత్తుల సతీష్ దర్శకత్వంలో సాయి సింహాద్రి సైన్మా బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాలో మీరా రాజ్ హీరోయిన్‌గా నటించగా, సీనియర్ నటుడు వినోద్ కుమార్ తండ్రి పాత్రలో కనిపించారు. హనుమాన్ మీడియా సంస్థ ద్వారా ఇదివరకే ‘ఆహా’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా, నేటి నుంచి ‘అమెజాన్ ప్రైమ్’లోనూ అందుబాటులోకి వచ్చింది.
ఫిబ్రవరి 27న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. సినిమా మొదటి భాగం అందమైన పల్లెటూరి వాతావరణం, వినోదంతో సాగుతూ ఇంటర్వెల్ ట్విస్ట్‌తో ఆసక్తికరంగా మారుతుంది. ముఖ్యంగా ద్వితీయార్థంలో తండ్రీకొడుకుల మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలు, ఆకట్టుకునే క్లైమాక్స్ ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి.
ఉన్నత నిర్మాణ విలువలతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని థియేటర్లలో ఆదరించినట్లే, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై కూడా వీక్షించి విజయవంతం చేయాలని చిత్ర బృందం ప్రేక్షకులను కోరింది.
The put up ఓటీటీలోకి వచ్చిన ‘సన్ ఆఫ్’.. ప్రైమ్, ఆహాలో స్ట్రీమింగ్ first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Rankings.
