Sun. Jul 5th, 2026

విడుదల తేదీ : జూలై 3, 2026

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు : సత్య దేవ్, వికాస్ ముప్పాల, దీపా థామస్, వెంకటేష్ మహా, బాలా పరాసర్ మరియు ఇతరులు
దర్శకత్వం : వెంకటేష్ మహా
సంగీతం : స్మరణ్ సాయి
నిర్మాతలు : చింతా గోపాలకృష్ణ రెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, ఈశ్వరన్ విజయరాఘవన్
సినిమాటోగ్రఫీ : కార్తీక్ పర్మార్
ఎడిటింగ్ : వెంకటేష్ మహా

సంబంధిత లింక్స్ : ట్రైలర్

ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన తాజా చిత్రాల్లో టాలెంటెడ్ నటుడు సత్యదేవ్ హీరోగా కేరాఫ్ కంచారపాలెం దర్శకుడు వెంకటేష్ మహా నుంచి వచ్చిన సినిమా “రావు బహదూర్” కూడా ఒకటి. మరి ఈ సినిమా ఈ కాంబినేషన్ పై ఉన్న అంచనాలు రీచ్ అయ్యిందా లేదా అనేది సమీక్షలో చూద్దాం.

కథ:

1991 సమయంలో ఒక రాజ కుటుంబానికి చెందిన వ్యక్తి భువనం రామప్ప రావు బహదూర్ అలియాస్ రామప్ప (సత్యదేవ్) లివర్ క్యాన్సర్ తో బాధ పడుతూ ఉంటాడు. అయినప్పటికీ వైద్యులుకి సవాలు చేసేలా తను ప్రాణాలు పోకుండా బతుకు కొనసాగిస్తాడు. అయితే తన స్నేహితుడు, డాక్టర్ ఆచారి (ప్రతిక్ గాంధీ) కి తనకు ఎంతో కాలంగా మిగిలిపోయిన ఒక అనుమానం కోసం చెబుతాడు. అసలు ఆ అనుమానం ఏంటి? ఎందుకు రామప్ప ఆ అనుమానం పెట్టేసుకున్నాడు? చివరికి తను ఆ అనుమానం విషయంలో అసలు నిజం తెలుసుకున్నాడా లేదా అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి.

ప్లస్ పాయింట్స్:

ఈ పర్టిక్యులర్ కాంబినేషన్ విషయంలో చాలా వరకు మంచి అంచనాలు ఉన్నాయి వాటిని రీచ్ అయ్యే క్రమంలో కొన్ని అంశాలు ఆ సినిమాలో మెప్పిస్తాయి. ఇందులో అనుమానం పెను భూతం అనే థీమ్ అంశాన్ని హుక్ చేసి పెడుతూ దర్శకుడు మైంటైన్ చేస్తూ తీసుకెళ్లిన కథనం ఆకట్టుకుంటుంది.

ఇక సత్యదేవ్ తన పాత్రలో సాలిడ్ పెర్ఫార్మన్స్ కనబరిచారు. కనిపించే ప్రతీ టైం లైన్ లో తాను చూపించిన వైవిద్యత చాలా బాగుంది. యంగ్ ఏజ్ నుంచి ఓల్డేజ్ వరకు వేరియేషన్స్ లో తను బాగా చేసాడు. తనతో పాటుగా మలయాళ నటి హీరోయిన్ దీపా థామస్ చాలా బాగా చేసింది. స్క్రీన్ పై మంచి స్క్రీన్ ప్రెజెన్స్ తో బ్యూటిఫుల్ గా కనిపించింది అదే విధంగా మంచి ఎమోషన్స్ తో పెర్ఫామ్ చేసింది.

వీరితో పాటుగా నటుడు వికాస్ ముప్పాల కూడా మంచి రోల్ దక్కించుకున్నారు. సినిమా ఆద్యంతం తను కొనసాగుతూ డీసెంట్ పెర్ఫార్మన్స్ అందించారు. తమతోనే కనిపించిన నటి బాల పరస ఆ ప్యాలెస్ పని మనిషిగా మంచి కామెడి టైమింగ్ తో చేశారు. ఇక వీటితో పాటుగా ఫస్టాఫ్ లో సత్యదేవ్, వికాస్ ముప్పాల నడుమ కొన్ని సంభాషణలు, సెకాండఫ్ లో ఎమోషనల్ మూమెంట్స్, కొన్ని కామెడీ సీక్వెన్స్ లు ఇంకా క్లైమాక్స్ ఓ ట్విస్ట్ ఇంప్రెస్ చేస్తాయి.

మైనస్ పాయింట్స్:

ఇందులో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఉన్నప్పటికీ దానికి అనుగుణంగా అల్లుకున్న కథనం కొంత సమయం తర్వాత అలా లోతుకు వెళ్లే కొద్దీ రెగ్యులర్ గా మారినట్లు అనిపిస్తుంది.

అంతేకాకుండా కేరాఫ్ కంచారపాలెం లాంటి క్లాసిక్ సినిమా కావడం పైగా దీనిని మరో ఇలాంటి తెలుగు సినిమా రాలేదు అనే రీతిలో హైప్ చేయడంతో నిజంగా ఆ రేంజ్ మ్యాటర్ ఉందా అనుకోని చూసేవారికి మాత్రం ఒకింత నిరాశనే ఈ సినిమా మిగులుస్తుంది అని చెప్పక తప్పదు.

క్లైమాక్స్ లో రివీల్ అయ్యే ట్విస్ట్ ల సమయానికి ఒక్కటి మినహా మరోటి అప్పటికే ఓ స్లరీ ఆడియెన్స్ లో వచ్చేస్తుంది. అలానే అక్కడక్కడా కథనం కొంచెం స్లోగా సాగదీతగా వెళుతున్నట్టు అనిపిస్తుంది.

సాంకేతిక వర్గం:

ఈ సినిమాలో నిర్మాణ విలువలు మాత్రం చాలా బావున్నాయి. సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకున్న సెటప్ అంతా చాలా బాగుంది. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ కి తగ్గట్టుగా ఒక వింటేజ్ ప్రపంచాన్ని సృష్టించారు. ఇందులో ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ ని మెచ్చుకోవాలి. కెమెరా వర్క్, మ్యూజిక్ ఇందులో బాగున్నాయి. ఫస్టాఫ్ లో ఓ సాంగ్, సెకండాఫ్ లో ఓ ఎమోషనల్ సాంగ్ బాగున్నాయి. ఎడిటింగ్ కూడా పర్వాలేదు.

ఇక దర్శకుడు వెంకటేష్ మహా విషయానికి వస్తే.. తన వర్క్ బాగుంది కానీ ఊహించని రీతిలో అయితే లేదు. కాన్సెప్ట్ కి కావాల్సిన సరంజామా అంతా సమకూర్చుకొని ఒకింత రొటీన్ ఫీల్ ని మిగిల్చారు. సో తన బాగానే అనిపిస్తుంది కానీ మరీ అమోఘం అని చెప్పలేం.

తీర్పు:

ఇక మొత్తంగా చూసుకున్నట్టైతే ఈ “రావు బహదూర్” డీసెంట్ గా సాగే కామెడీ అండ్ ఎమోషనల్ డ్రామాగా నిలుస్తుంది. అనుమానం పెనుభూతం అనే కాన్సెప్ట్ పై దర్శకుడు మైంటైన్ చేసిన సస్పెన్స్ ఫ్యాక్టర్, దీనిపై సాగే సంభాషణలు అలాగే అక్కడక్కడా ఫన్ మూమెంట్స్ సహా ఎమోషన్స్ ఇందులో బాగున్నాయి. సత్యదేవ్ తన వెర్సటాలిటీ చూపించారు. ఇతర నటీనటులు కూడా మంచి సహకారం అందించారు. కానీ ఈ సినిమా విషయంలో ఓవర్ అంచనాలు పెట్టుకుంటే మాత్రం ఈ కాంబినేషన్ కోసం ఎదురు చూసిన ఆడియెన్స్ కొంతమేర నిరాశ చెందవచ్చు. సో వాటి విషయంలో కాంప్రమైజ్ అయితే ఈ సినిమా డీసెంట్ గా అనిపిస్తుంది.

123telugu.com Ranking: 3/5

Reviewed by way of 123telugu Workforce

Click on Right here For English Assessment

The publish సమీక్ష: ‘రావు బహదూర్’ –  ఆకట్టుకునే పీరియాడిక్ డ్రామా first seemed on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.