యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ రొమాంటిక్ డ్రామా ‘చెన్నై లవ్ స్టోరీ’ జూలై 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ మంచి బజ్‌ను క్రియేట్ చేయగా, మెలోడీ బ్రహ్మ మణిశర్మ అందించిన పాటలకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రంలో శ్రీ గౌరి ప్రియ హీరోయిన్‌గా నటించింది.
తాజాగా ఈ సినిమా నుంచి ‘హోయిలా హోయిలా’ సాంగ్ లాంచ్ చేశారు. ఈ లాంచ్ ఈవెంట్‌లో చిత్ర నిర్మాత సాయి రాజేష్ సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రం బ్లాక్‌బస్టర్ ‘బేబీ’ సినిమా కంటే మూడు రెట్లు అద్భుతంగా ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశాడు. తాను ఇప్పటికే ఈ సినిమాను 10 సార్లు చూశానని, రిలీజ్ తర్వాత ఈ చిత్రం ఖచ్చితంగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటుందని తెలిపారు.
రవి నంబూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సాయి రాజేష్ కథను అందించారు. అమృతా ప్రొడక్షన్స్ మరియు మాస్ మూవీ మేకర్స్ బ్యానర్లపై ఎస్‌కేఎన్‌తో కలిసి సాయి రాజేష్ ఈ సినిమాను నిర్మించారు.
The put up ‘చెన్నై లవ్ స్టోరీ’ నెక్స్ట్ లెవెల్ అంటున్న ‘బేబీ’ డైరెక్టర్..! first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Rankings.
