విరాట్ కర్ణ, నభా నటేష్ ప్రధాన పాత్రల్లో అభిషేక్ నామా దర్శకత్వంలో రూపొందిన మైథలాజికల్ అడ్వెంచర్ చిత్రం ‘నాగబంధం’ మంచి అంచనాల మధ్య బాక్సాఫీస్ దగ్గర జూలై 3న రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకు థియేటర్లలో మంచి రెస్పాన్స్ వస్తుండటంతో మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అయితే, ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ తాజాగా ఓ పెద్ద అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాను 3 గంటల 5 నిమిషాల రన్‌టైమ్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కాగా, ఇది లెంగ్తీగా ఉందనే రెస్పాన్స్ రావడంతో ఇప్పుడు ఈ రన్‌టైమ్‌ను తగ్గించినట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమాను 20 నిమిషాల పాటు ట్రిమ్ చేసినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. దీంతో ఇప్పుడు ఈ మూవీ 2 గంటల 45 నిమిషాల రన్‌టైమ్‌తో ప్రేక్షకులను అలరించబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ఈ చిత్రాన్ని ఎన్ఐకే స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్ బ్యానర్లపై కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి నిర్మించగా ఈ మూవీలో రిషబ్ సాహ్ని, ఐశ్వర్య మీనన్, జగపతి బాబు, మురళీ శర్మ కీలక పాత్రలు పోషించారు.
The submit ‘నాగబంధం’ మూవీ రన్‌టైమ్‌లో మార్పు.. కొత్త రన్‌టైమ్ ఎంతంటే..? first gave the impression on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.
