టాలీవుడ్ హిట్ మెషిన్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ మరియు నందమూరి కళ్యాణ్ రామ్‌లతో కలిసి ఒక ఫన్-ఫిల్డ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను పట్టాలెక్కిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. అయితే, ఈ చిత్రం మలయాళంలో రూపొందిన ఓ చిత్రానికి రీమేక్ అనే వార్తలు సినీ సర్కిల్స్‌లో జోరుగా చక్కర్లు కొట్టాయి.
పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన సూపర్ హిట్ సినిమా ‘గురువాయూర్ అంబలనాదరుల్’కు ఈ సినిమా రీమేక్‌గా రాబోతుందనే వార్తలు వినిపించాయి. ఈ మల్టీస్టారర్ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న కీర్తి సురేష్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఈ పుకార్లకు చెక్ పెట్టింది. ఈ సినిమా రీమేక్ కాదంటూ వస్తున్న పుకార్లను ఆమె పూర్తిగా కొట్టిపారేసింది. ఈ క్రేజీ కామెడీ ఎంటర్‌టైనర్ పూర్తిగా అనిల్ రావిపూడి రాసుకున్న ఒరిజినల్ కథతోనే తెరకెక్కుతోందని స్పష్టం చేస్తూ బేస్‌లెస్ రూమర్లకు ఫుల్ స్టాప్ పెట్టింది.
ఈ సినిమాలో మరో హీరోయిన్‌గా కృతి శెట్టి నటిస్తుండగా, ప్రముఖ సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాను 2027 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
The submit అనిల్ రావిపూడి-వెంకటేష్ మూవీపై కీర్తి సురేష్ క్లారిటీ.. రీమేక్ కాదట..! first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Rankings.
