తమిళ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ బ్లాక్‌బస్టర్ చిత్రాలతో తన సత్తా చాటి ఇప్పుడు ‘డీసీ’ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్ర ప్రమోషన్స్‌లో లోకేశ్ బిజీగా ఉన్నాడు. అయితే, ఇప్పుడు ఆయన మరో కొత్త అవతారంలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.
త్వరలోనే ఆయన నిర్మాతగా ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. విశాల్ వెంకట్ దర్శకత్వం వహించనున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో టాలెంటెడ్ బ్యూటీ రెజీనా కసాండ్రా లీడ్ రోల్ చేయనుందట. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే పూర్తయింది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు కోలీవుడ్ మీడియా చెబుతోంది.
ఇక ఈ సినిమాలో రెజీనాకు మంచి పర్ఫార్మె్న్స్‌కు స్కోప్ ఉండనుందని.. ఈ సినిమాతో ఆమెకు మంచి బ్రేక్ దొరకనుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
The submit లోకేశ్ కనగరాజ్ సినిమాలో రెజీనా.. అయితే..! first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.
