Sun. Jul 5th, 2026

ఓటీటీ వేదిక : జియోహాట్‌స్టార్

ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ : జూలై 3, 2026

123తెలుగు.కామ్ రేటింగ్ 3/5

నటీనటులు : వీర్ హిరానీ, అర్షద్ వర్శి, విక్రాంత్ మెస్సి, బొమన్ ఇరానీ, సంజయ్ దత్, సెహ్వాగ్ తదితరులు
దర్శకత్వం : అవినాష్ అరుణ్
నిర్మాతలు : రాజ్ కుమార్ హిరానీ
సంగీతం : శంతాను మొయిత్రా
ఛాయాగ్రహణం : అవినాష్ అరుణ్
కూర్పు : రాజ్ కుమార్ హిరానీ

సంబంధిత లింక్స్ : ట్రైలర్

లేటెస్ట్ గా ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చిన కంటెంట్ లో బాలీవుడ్ స్టార్ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ నిర్మాణం వహించిన వెబ్ సిరీస్ ‘ప్రీతమ్ అండ్ పెద్రో’ కూడా ఒకటి. రాజు హిరానీ కథ, నిర్మాణంలో టాలెంటెడ్ నటుడు విక్రాంత్ మెస్సి నటించిన ఈ సిరీస్ లో సెహ్వాగ్, సంజయ్ దత్ లాంటి స్టార్స్ క్యామియోలు కూడా ఉన్నాయి. అసలు ఈ సిరీస్ సంగతి ఏంటో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

ఈ సిరీస్ నార్త్ గోవాలో 80 లక్షలు ఉన్న ఒక ఏటీఎం చోరీతో మొదలవుతుంది. ఇది అక్కడి పోలీస్ కి తలనొప్పిగా మారగా అక్కడే ఓ స్టేషన్ లో క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ గా పని చేసే పెద్రో గన్సాల్వేస్ (అర్షద్ వర్సి) తన టీం తో హ్యాండిల్ చేసే సమయంలో వాక్యూమ్ క్లీనర్లు అమ్ముకునే కుర్రాడు ప్రీతమ్ పార్కర్ (వీర్ హిరానీ) తన తాతయ్య రేడియో అందులో క్యాసెట్ పోయిందని కంప్లైంట్ ఇచ్చేందుకు వస్తాడు. కానీ ఏటీఎం టెన్షన్ లో ఉన్న వారి ప్రీతమ్ కేసు పట్టించుకోకపోగా తనని సెల్ లో పడేస్తారు. కానీ ఆ ఏటీఎం కేసును తీరా ప్రీతమ్ నే సాల్వ్ చేస్తాడు. తన టాలెంట్ చూసి పెద్రో ప్రీతమ్ కి ఫ్రెండ్ అవుతాడు. ఇలా వీరి కాంబినేషన్ కి ఒక షాకింగ్ సవాల్ ఓ హ్యాకర్ మార్టిన్ (విక్రాంత్ మెస్సి) స్పోర్ట్స్ మినిస్టర్ విన్నీ సర్దేసాయ్ (శ్రేయాన్స్ కౌరవ్) కొడుకుని కిడ్నాప్ చేసి విసురుతాడు. మరి ఆ హ్యాకర్ ఎందుకు అతన్ని కిడ్నాప్ చేసాడు. ఈ క్రమంలో ప్రీతమ్ ని ఆత్మ హత్య చేసుకునేలా ట్రాప్ చేస్తాడు? అసలు అతనికి మార్టిన్ కి ఉన్న లింక్ ఏంటి? చివరికి ఆ బాబుని కాపాడారా లేదా? ప్రీతమ్ కి ఉన్న గతం ఏంటి? ఇందులో అందరి సమస్యలు ఎలా సాల్వ్ అయ్యాయి అనేది తెలియాలి అంటే ఈ సిరీస్ చూసి తెలుసుకోవాలి.

ప్లస్ పాయింట్స్:

దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ హ్యాండ్ ఉండడంతో ఈ సిరీస్ కోసం తన ఫ్యాన్స్ ఇంకా జెనరల్ ఆడియెన్స్ లో కూడా ఒక అంచనా ఉండొచ్చు. ఈ సిరీస్ తాను కథ, స్క్రీన్ ప్లే కూడా అందించడం జరిగింది. మరి తన మార్క్ ని ఆశించేవారికి ఓ ఇంట్రెస్టింగ్ ఇన్వెస్టిగేషన్ సిరీస్ లాంటివి చూడాలి అనుకునేవారికి ఈ ప్రీతమ్ అండ్ పెద్రో డీసెంట్ ట్రీట్ లు అందిస్తారు.

ఇందులో మెయిన్ గా ఇంప్రెస్ చేసే అంశం ఏదన్నా ఉంది అంటే రచన, దర్శకత్వం అనే చెప్పొచ్చు. పేపర్ పై రాసుకున్న స్క్రీన్ ప్లే ఇంకా సన్నివేశాలు బాగా ఎస్టాబ్లిష్ చేయబడ్డాయి. అలాగే కేవలం 6 ఎపిసోడ్స్ గా మాత్రమే సిరీస్ ని అరగంట నిడివితో పెద్దగా డ్రాగ్ చేయకుండా డిజైన్ చేయడం మరో మంచి అంశం అని చెప్పొచ్చు. ఒక పక్క ఇంట్రెస్టింగ్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ తో పాటుగా రాజ్ కుమార్ హిరానీ స్టయిల్ కామెడీ సీన్స్ అండ్ టైమింగ్ ఇందులో బాగున్నాయి.

అంతే కాకుండా వీర్ హిరానీకి విక్రాంత్ మెస్సి పాత్రలకి మధ్య కొన్ని సన్నివేశాలు మంచి ఇంట్రెస్టింగ్ గా ఇంటెలిజెంట్ గా కూడా అనిపిస్తాయి. ఇక నటీనటుల్లో వీర్ హిరానీ బాగా చేసాడు. సింపుల్ లుక్స్ లో తన పాత్రకి కావాల్సిన విధంగా నటించి ఇంప్రెస్ చేసాడు. తనతో పాటుగా కనిపించిన అర్షద్ వర్శి రోల్ కూడా ఇందులో బాగుంది. తాను, ప్రీతమ్ కలిసి చేసే ఇన్వెస్టిగేషన్, వారి మధ్య కామెడీ ట్రాక్స్, ఇంకా కొన్ని ఎమోషనల్ సీన్స్ బ్యూటిఫుల్ గా అనిపిస్తాయి.

వీరితో పాటుగా లిమిటెడ్ స్క్రీన్ టైం లో కనిపించిన టాలెంటెడ్ నటుడు విక్రాంత్ మెస్సి కూడా బాగా చేసాడు. తనకి, ప్రీతమ్ రోల్ కి చేసిన లింక్ అలానే దానికి ఇచ్చిన ముగింపు ఇంకా వారి మధ్య సన్నివేశాలు సిరీస్ లో ఇంప్రెస్ చేస్తాయి. అంతే కాకుండా ఈ సిరీస్ ఎక్కడైతే మొదలైందో దానితోనే ముగించడం చూసే ఆడియెన్ కి తేలికగా అనిపించేలా చేస్తుంది.

వీటితో పాటుగా గెస్ట్ రోల్ లో కనిపించిన బొమన్ ఇరానీ బాగా చేశారు. ఇంకా సంజయ్ దత్, వీరేంద్ర సెహ్వాగ్ ల క్యామియోలు ఫైనల్ ఎపిసోడ్ లో మంచి ఫన్ గా డిజైన్ చేసుకొని ప్రెజెంట్ చేయడం బాగుంది. ఇవన్నీ పక్కన పెడితే చిన్న పిల్లల విషయంలో ఇప్పుడున్న తల్లిదండ్రులు ఎంత అశ్రద్దగా ఉంటున్నారో అనేది సందేశం ఇవ్వకుండానే చూపించారు. ఇది కూడా ఇందులో ఆలోచించేలా చేస్తుంది.

మైనస్ పాయింట్స్:

ఈ సిరీస్ లో దాదాపు డ్రాగ్ లేకుండానే నడిచిన కథనంలో అక్కడక్కడా కొన్ని సీన్స్ మాత్రం రొటీన్ అండ్ రెగ్యులర్ గానే అనిపిస్తాయి. వీటితో పాటుగా కొన్ని లాజిక్స్ కూడా సింపుల్ గా ఉంచేసినట్టు అనిపిస్తుంది. కేవలం 6 ఎపిసోడ్స్ గా ప్లాన్ చేసిన సిరీస్ లో ప్రీతమ్, మార్టిన్ ల మధ్య ఘర్షణ మరింత బలంగా ప్లాన్ చేసుకొని ఉంటే బాగుండేది.

అలానే కొన్ని సీన్స్ ఎంతైతే ఇంటెలిజెంట్ గా అనిపిస్తాయో కొన్ని సీన్స్ అంతే సింపుల్ గా అనిపిస్తాయి. అలానే విక్రాంత్ మెస్సి లాంటి నటుణ్ని చాలా తక్కువ వినియోగించుకున్నారు అనిపిస్తుంది. సో ఇది తన నుంచి ఇంకా ఎక్కువ ఆశించేవారికి డిజప్పాయింట్ చేస్తుంది. అలానే తెలుగు డబ్బింగ్ మాత్రం పూర్తి స్థాయిలో ఇంప్రెస్ చేయదు.

సాంకేతిక వర్గం:

ఈ సిరీస్ లో నిర్మాణ విలువలు డీసెంట్ అని చెప్పొచ్చు. టెక్నీకల్ అంశాలు బాగున్నాయి. సంగీతం బాగుంది. క్లైమాక్స్ లో శ్రేయా ఘోషల్ వాయిస్ తో వచ్చే సాంగ్ రాజ్ కుమార్ హిరానీ సినిమాల్లో కనిపించే సోల్ లా టచ్ చేస్తుంది. కెమెరా వర్క్ ఎడిటింగ్ కూడా బాగానే ఉన్నాయి. తెలుగు డబ్బింగ్ ఇంకా కేర్ తీసుకోవాల్సింది. ఇక దర్శకుడు అవినాష్ అరుణ్ విషయానికి వస్తే.. రాజ్ కుమార్ హిరానీ, ఇతరులు ఇచ్చిన కథ, స్క్రీన్ ప్లేని తాను నీట్ గా ఆవిష్కరించడంలో సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. సో తన వర్క్ ఈ సిరీస్ లో మెప్పిస్తుంది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ ‘ప్రీతమ్ అండ్ పెద్రో’ నీట్ గా సాగే ఓ నైస్ సిరీస్ గా నిలుస్తుంది. రాజ్ కుమార్ హిరానీ టచ్ లో ఉంటూనే మంచి కామెడీ, ఎమోషన్స్ సహా సైబర్ ఇన్వెస్టిగేషన్ ఎపిసోడ్స్, చిన్నపాటి మెసేజ్ ఇంకా నటీనటుల పెర్ఫామెన్స్ లు సంజయ్ దత్, సెహ్వాగ్ లాంటి వారి క్యామియోలు ఇందులో ఇంప్రెస్ చేస్తాయి. తక్కువ ఎపిసోడ్స్ లోనే ఎంగేజింగ్ గా నడిచే సిరీస్ ఇది. అక్కడక్కడా నిరాశ కలిగించే అంశాలు కొన్నే ఉన్నాయి కాబట్టి ఈ సిరీస్ ని జియో హాట్ స్టార్ లో చూడొచ్చు. తెలుగు డబ్బింగ్ లో కూడా ఉంది వాచ్ ఇట్.

123telugu.com Ranking: 3/5

Reviewed by means of 123telugu Group

The publish ఓటిటి సమీక్ష: ‘ప్రీతమ్ అండ్ పెద్రో’ – రాజ్ కుమార్ హిరానీ తెలుగు డబ్ సిరీస్ జియో హాట్ స్టార్ లో first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.