సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సెన్సేషనల్ పాన్ వరల్డ్ సినిమానే “వారణాసి”. గ్లోబల్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ అత్యంత ప్రతిష్టాత్మకంగా వస్తుంది. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు పలు రకాల షేడ్స్ లో గెటప్ లలో కనిపించనున్న సంగతి అందరికి తెలిసిందే.
అయితే తాను ఎన్ని షేడ్స్ లో కనిపించినా శ్రీరామ చంద్రుని అవతారంలో కనిపించే దృశ్యాలు మాత్రం నెక్స్ట్ లెవెల్ అని భారీ స్టేజిపై ఎస్ ఎస్ రాజమౌళి చెప్పడం కేజ్రీగా మారింది. అయితే ఈ గెటప్ కి సంబంధించి సోషల్ మీడియాలో ఓ షాకింగ్ పిక్ వైరల్ గా మారింది. మహేష్ బాబు రాముడి గెటప్ లో సెట్స్ నుంచి కనిపిస్తున్న ఫోటో ఇది. దీనితో చాలామంది ఇది నిజంగానే సినిమా సెట్స్ నుంచి లీక్ అని నమ్మేస్తున్నారు.
కానీ అందులో అసలు నిజం ఏంటంటే అది లీక్ కాదు ఏమీ కాదు. అది పూర్తిగా ఏఐ తో చేసిన ఫోటోగా సరిగ్గా గమనిస్తేనే అర్ధం అయ్యిపోతుంది. సో ఫ్యాన్స్ ఈ విషయంలో పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది వరకు పలు లీక్ లు అయితే సెట్స్ నుంచి వచ్చాయి కానీ ఇప్పుడు ప్రచారం జరుగుతున్న ఫోటో మాత్రం పూర్తిగా ఫేక్.
The submit ‘వారణాసి’ నుంచి మహేష్ రాముడి గెటప్ లీక్.. అసలు నిజం ఇది! first gave the impression on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Scores.
