బాలీవుడ్ స్టార్ బ్యూటీ ఆలియా భట్, శర్వరి ప్రధాన పాత్రల్లో నటించిన మోస్ట్ అవేటెడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఆల్ఫా’ థియేటర్లలో సందడి చేస్తోంది. ట్రైలర్ విడుదలైనప్పటి నుంచే భారీ అంచనాలు క్రియేట్ చేసిన ఈ చిత్రం, మొదటి రోజే బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమా తొలిరోజే బాక్సాఫీస్ వద్ద తన పవర్ చూపించింది.
సాక్నిల్క్ రిపోర్ట్ ప్రకారం, భారత్‌లో తొలిరోజే ఈ సినిమా రూ. 9.25 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించింది. దేశవ్యాప్తంగా మొత్తం 7,534 షోలలో ఈ చిత్రం ప్రదర్శితమవగా, ఇండియాలో గ్రాస్ వసూళ్లు రూ. 11.1 కోట్లకు చేరాయి. మరోవైపు ఓవర్సీస్ మార్కెట్ లోనూ ఆలియా క్రేజ్ బాగానే వర్కవుట్ అయింది. విదేశాల్లో మొదటి రోజు రూ. 5 కోట్ల గ్రాస్ రాబట్టడంతో, ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు మొత్తం కలెక్షన్స్ రూ. 16.1 కోట్ల గ్రాస్ మార్కును తాకాయి.
థియేటర్లలో ఆక్యుపెన్సీ విషయానికి వస్తే, మొదటి రోజు సగటున 20.4 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. ఉదయం షోలకు 9.92 శాతంతో కాస్త నెమ్మదిగా ప్రారంభమైనప్పటికీ, టాక్ స్ప్రెడ్ అవ్వడంతో సమయం గడిచేకొద్దీ థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య పెరిగింది. మధ్యాహ్నం షోలకు 17.85 శాతం, ఈవెనింగ్ షోలకు 19.69 శాతం మంది రాగా, నైట్ షోస్ లో ఏకంగా 34.15 శాతంతో అత్యధిక ఆక్యుపెన్సీ రికార్డయింది.
స్పై యూనివర్స్ లో హృతిక్ రోషన్ మెరుపులు
శివ్ రావల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఆలియా భట్ తో పాటు శర్వరి యాక్షన్ ప్యాక్డ్ రోల్స్ లో అదరగొట్టారు. యష్ రాజ్ ఫిల్మ్స్ (YRF) స్పై యూనివర్స్ లో మహిళా లీడ్ తో వచ్చిన తొలి బడా ప్రాజెక్ట్ ఇదే కావడంతో బాలీవుడ్ లో దీనిపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. వీరితో పాటు బాబీ డియోల్, అనిల్ కపూర్ కీలక పాత్రల్లో మెరిశారు. అన్నింటికీ మించి ‘వార్’ సిరీస్ లోని తన పాపులర్ క్యారెక్టర్ ‘కబీర్’ గా హృతిక్ రోషన్ ఇచ్చిన స్పెషల్ కామియో థియేటర్లలో ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించింది.
ఒక దుర్మార్గపు కమాండర్ చేతిలో ఒంటరిగా, సూపర్ సోల్జర్ గా పెరిగిన ఓ ప్రొఫెషనల్ అస్సాసిన్ కథతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. తన కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని తెలుసుకుని, తన సోదరితో కలిసి ఆ కమాండర్ మిలిటరీ నెట్‌వర్క్‌ను ఎలా అంతమొందించిందనేది అసలు స్టోరీ. ఫస్టాఫ్ చాలా క్రిస్ప్ గా, గ్రిప్పింగ్ గా ఉన్నప్పటికీ, సెకండాఫ్ లో కథ కాస్త స్లో అయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇందులో హాలీవుడ్ మార్వెల్ సినిమాల ఛాయలు కూడా కనిపిస్తాయి. మార్కెట్ లో లాంగ్ వీకెండ్ అడ్వాంటేజ్ ఉండటంతో రాబోయే రోజుల్లో ఈ కలెక్షన్స్ మరికొంత పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
The submit Alpha Field Place of business: ఆలియా భట్ ‘ఆల్ఫా’ ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్.. ఫస్ట్ డే ఎంతొచ్చిందంటే? first seemed on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Scores.
