తమిళ నటుడు విజయ్ ఆంటోనీ నటించిన రీసెంట్ మూవీ ‘వంద దేవుళ్ళు’ జూన్ 19న థియేటర్లలో రిలీజై మంచి టాక్ తెచ్చుకుంది. పూర్తి ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రం రావడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఒకింత క్యూరియాసిటీ ఏర్పడింది. అయితే, టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఎక్కువ రోజులు రన్ సాగించలేకపోయిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ పార్ట్నర్ను లాక్ చేసుకుంది.
‘వంద దేవుళ్ళు’ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జీ5 స్ట్రీమింగ్ చేసేందుకు సిద్ధమవుతుంది. అతి త్వరలో ఈ చిత్రాన్ని డిజిటల్ స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు జీ5 ప్రకటించింది. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది.
శశి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో లిజోమోల్ జోస్, అజయ్ ధీషాన్, శ్వాసిక విజయ్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. మరి ఈ సినిమాను ఎప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్కు తీసుకొస్తారనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.
The publish ఎట్టకేలకు ఓటీటీ పార్ట్నర్ను లాక్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ‘వంద దేవుళ్ళు’.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..? first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.
