Sat. Jul 25th, 2026

ధనుష్ దర్శకత్వంలో వచ్చిన ‘నిలవుక్కు ఎన్‌మేల్ ఎన్నడి కోబం’ (NEEK) చిత్రంతో హీరోగా పరిచయమైన పవిష్ నారాయణ్, ఇటీవల ‘లవ్ ఓ లవ్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కొత్త దర్శకుడు రామ్ గోపాల్ తెరకెక్కించిన ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం 2026 జూలై 10న తమిళ, తెలుగు భాషల్లో విడుదలై మిక్సి్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. కాగా, ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది.

థియేటర్లలో విడుదలైన కేవలం మూడు వారాల్లోనే ఈ చిత్రం ఓటీటీలోకి అడుగుపెడుతోంది. జూలై 31, 2026 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ‘లవ్ ఓ లవ్’ స్ట్రీమింగ్ కానుంది.

తెలుగు ఫోక్ డ్యాన్సర్ నాగ దుర్గ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించగా కె. సెల్వరాఘవన్, కె.ఎస్. రవికుమార్, వనితా విజయ్ కుమార్, ఆదిత్య కతిర్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచిన ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ఓటీటీ వీక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

The submit ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న ‘లవ్ ఓ లవ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎందులో అంటే..? first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.