Sat. Jul 25th, 2026

భారతీయ సినిమాలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న పౌరాణిక దృశ్యకావ్యం ‘రామాయణ’పై రోజురోజుకూ అంచనాలు పెరిగిపోతున్నాయి. నితీష్ తివారీ దర్శకత్వంలో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణాసురుడిగా యష్ నటిస్తున్నారు.

ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ వార్త బయటకు వచ్చింది. ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ సోనీ పిక్చర్స్ ఈ చిత్ర అంతర్జాతీయ పంపిణీ హక్కులను దక్కించుకుంది. హాలీవుడ్ సినిమాల స్థాయిలోనే ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేసేందుకు సోనీ పిక్చర్స్ ప్లాన్ చేస్తోంది. ఇందులో అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే, కేవలం అంతర్జాతీయ ప్రమోషన్ల కోసమే సోనీ పిక్చర్స్ ఏకంగా రూ. 235 కోట్లు ఖర్చు చేయనుండగా, మేకర్స్ మరో రూ.140 కోట్లు జత చేస్తున్నారు. అంటే మొత్తం రూ.375 కోట్ల భారీ బడ్జెట్‌ను ఒక్క పబ్లిసిటీ కోసమే కేటాయించడం భారతీయ సినిమా చరిత్రలోనే రికార్డ్‌గా మారనుంది.

ఏఆర్ రెహమాన్, హాన్స్ జిమ్మర్ అందించే సంగీతం, ఐమాక్స్ ఫార్మాట్, టాప్-నాచ్ విజువల్ ఎఫెక్ట్స్‌తో ఈ చిత్రాన్ని మేకర్స్ తీర్చిదిద్దుతున్నారు. కాగా, ఈ సినిమా ట్రైలర్ కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులందరి దృష్టి ఈ చిత్రం ట్రైలర్‌పైనే నెలకొంది.

The submit ప్రమోషన్స్ కోసం రామాయణ బడ్జెట్.. కళ్లు చెదిరి పోవాల్సిందే..! first gave the impression on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.