Sun. Jul 26th, 2026

కోలీవుడ్ సినిమాలకి, అక్కడి హీరోలకి మన దగ్గర మార్కెట్ లో ఉన్నట్టుగా మన సినిమాలకి, హీరోలకి ఆదరణ లేదు అనే మాటలో ఎలాంటి సందేహం లేదు. అలా మన సినిమాలు ఎందుకు రాణించడం లేదు అనే ఆవేదనను ఎలాంటి మొహమాటం లేకుండా బయటకి చెప్పిన ఓన్లీ యంగ్ టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం. నిజానికి ఇది ట్రూ టాలీవుడ్ సినిమా లవర్స్ మనసులోని మాట.

అరే మనం వారి సినిమాలు ఇంతలా ఆదరిస్తున్నాం మన సినిమాలు ఎందుకు అక్కడ ఏకకాలంలో రిలీజ్ చేసుకోలేకపోతున్నాం, ఒకవేళ చేసినా ఎందుకు ఆడియెన్స్ ఎంకరేజ్ చేయడం లేదు అనే ప్రశ్న చాలా మందిలో ఉంది. అయితే ఇలాంటి ప్రశ్ననే లేవనెత్తి అదే కోలీవుడ్ స్టార్స్ తో క్లాష్ లో వచ్చి మరీ హిట్స్ కొట్టిన హీరోగా ఇపుడు కిరణ్ నిలిచాడు అని చెప్పవచ్చు.

తన ‘వినరో భాగ్యము విష్ణు కథ’ నుంచి ‘క’ ఇంకా లేటెస్ట్ ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమాలు అన్నిట్లో కోలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు అది కూడా తెలుగులో మంచి బజ్ లోనే ఉన్న సినిమాలు గట్టి పోటీ ఇచ్చినప్పటికీ తాను నమ్మిన కంటెంట్ తో కిరణ్ అబ్బవరం స్ట్రాంగ్ గా నిలిచి సాలిడ్ వసూళ్లు సాధించాడు.

ముందు రెండు సినిమాలూ ఒకెత్తు అయితే ఇపుడు సీఎం విజయ్ లాంటి స్టార్,తెలుగులో మంచి మార్కెట్ ని సంపాదించుకున్న హీరో ఆఖరి సినిమా ‘జన నాయకుడు’ లాంటి ప్రాజెక్ట్ ఉన్నప్పటికీ కిరణ్ అబ్బవరం చెన్నై లవ్ స్టోరీ అనే చిన్న సినిమాతో క్లాష్ కి వచ్చి మరీ దానికి మించి పెర్ఫామ్ చేస్తుండడం తన నమ్మకానికి ఉన్న నిదర్శనం.

చాలామంది ఈ పర్టిక్యులర్ క్లాష్ లో కిరణ్ ని తక్కువ అంచనా వేసినవాళ్లు కూడా ఉన్నారు కానీ వారి అంచనాలు తలకిందులు చేస్తూ ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ పెర్ఫామ్ చేస్తూ దూసుకెళ్తుంది. ఇది ఖచ్చితంగా కిరణ్ అబ్బవరంకి, మాస్ మూవీ మేకర్స్ కి ఓ మెమొరబుల్ మూమెంట్ గా నిలిచే విజయం అని చెప్పవచ్చు.

The submit తమిళ మార్కెట్ కోరుకున్నాడు.. తమిళ్ స్టార్స్ తో క్లాష్ లోనే గెలిచాడు.. ‘చెన్నై లవ్ స్టోరీ’తో మళ్ళీ కొట్టిన కిరణ్ అబ్బవరం first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Rankings.