నారా రోహిత్ రొటీన్ కు భిన్నంగా, సరికొత్త కథాంశాలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తుంటాడు. తాజాగా ఆయన పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. చిమ్మిలి మణికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘సౌండ్ ఇంజనీర్’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఫస్ట్ లుక్‌తోనే ఈ సినిమా వైవిధ్యమైన వినోదాన్ని పంచబోతోందని స్పష్టమవుతోంది.
ఈ ఫస్ట్ లుక్ పోస్టర్లో నారా రోహిత్ ప్రశాంతంగా యోగా, ధ్యానం చేస్తూ కనిపిస్తుండగా, ఆయన చుట్టూ ఉన్నవారు మాత్రం ఆయనకు ప్రతి చిన్న శబ్దం వినిపిస్తుందేమోనని భయపడుతున్నట్లు చూపించారు. పోస్టర్‌పై ఉన్న తెలుగు లైన్స్ ఈ పాత్రలోని ఎంటర్టైనింగ్ కోణాన్ని అద్భుతంగా ప్రతిబింబిస్తున్నాయి. నారా రోహిత్ చాలా హ్యాండ్సమ్గా, డాషింగ్‌గా కనిపిస్తూ మరోసారి ఒక డిఫరెంట్ ఎంటర్టైనర్తో రాబోతున్నాడని నమ్మకాన్ని కలిగిస్తున్నాడు.
భరత్ చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి విలక్షణ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండటం విశేషం. ఆయన రీ-ఎంట్రీతో ఈ సినిమాపై అంచనాలు మరిన్ని పెరిగాయి. టైటిల్ పోస్టర్‌తోనే భారీ ఆసక్తిని రేకెత్తించిన ‘సౌండ్ ఇంజనీర్’ చిత్రానికి సంబంధించిన మిగతా వివరాలు మేకర్స్ త్వరలోనే వెల్లడించనున్నారు.
The put up ‘సౌండ్ ఇంజనీర్’గా మారిన నారా రోహిత్.. ఫస్ట్ లుక్ అదిరింది..! first seemed on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.
