Sun. Jul 26th, 2026

తమిళ స్టార్ సూర్య, దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో వస్తున్న భారీ ఫ్యామిలీ డ్రామా ‘విశ్వనాథ్ & సన్స్’. సీతార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రల్లో నటిస్తుండగా, ఆగస్టు 14న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.

​ఈ సినిమా నుంచి తాజగా విడుదలైన ‘ది వెడ్డింగ్ సాంగ్’ పండుగ వాతావరణాన్ని తలపిస్తూ విపరీతంగా ఆకట్టుకుంటోంది. జీవీ ప్రకాష్ కుమార్ స్వరపరిచిన ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి అద్భుతమైన సాహిత్యం అందించారు. విశేషమేమిటంటే, ఈ తెలుగు పాటని సూర్య స్వయంగా పాడి అభిమానులకి ఊహించని సర్ప్రైజ్ ఇచ్చాడు.
​పాటలో సూర్య, మమితా బైజుల కెమిస్ట్రీ, డ్యాన్స్ మూమెంట్స్ మరియు విజువల్స్ కళ్లకి విందులా ఉన్నాయి. ఎనర్జిటిక్ కొరియోగ్రఫీ, కుటంబ భావోద్వేగాలతో నిండిన ఈ వేడుక పాట రాబోయే పెళ్లిళ్ల సీజన్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

The submit పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చిన సూర్య.. విశ్వనాధ్ అండ్ సన్స్ నుంచి వెడ్డింగ్ సాంగ్ ట్రీట్..! first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Rankings.