నందమూరి నటసింహం బాలకృష్ణ సినిమా షూట్ లో ఊహించని విధంగా గాయానికి లోనైన సంగతి తెలిసిందే. ఏఐజి హాస్పిటల్స్ వారు విజయవంతంగా బాలయ్యకి సర్జరీ కూడా చేశారు. దీంతో, కొరటాల శివ దర్శకత్వంలో బాలయ్య బాబు హీరోగా రాబోతున్న సినిమా పోస్ట్ ఫోన్ అయింది. ఆగస్టు లాస్ట్ వీక్ నుంచి ఈ సినిమాకు సంబంధించి ఒక కీలకమైన షెడ్యూల్ ను స్టార్ట్ చేయాలని ప్లాన్ చేశారు. బాలయ్య బెడ్ రెస్ట్ కారణంగా ఇప్పుడు ఈ సినిమా షూట్ పోస్ట్ ఫోన్ అయింది.
ఐతే, సెంప్టెబర్ రెండో వారంలో ఈ సినిమా షూట్ ను స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మొదట బాలయ్య లేని సీన్స్ ను షూట్ చేయనున్నారు. మొత్తానికి ఈ సినిమాలో బాలయ్యను పూర్తిస్థాయి మాస్ అవతార్‌లో చూపించనున్నారు కొరటాల శివ. పైగా ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా ఉంటాయని తెలుస్తోంది. స్టోరీ కూడా ప్రత్యేకంగా ఉంటుందట. దేవర తర్వాత కొరటాల శివ చేస్తున్న సినిమా కావడంతో.. కథ పై కొరటాల బాగా కసరత్తులు చేశారట. కాగా సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
The submit బాలయ్య లేని సీన్స్ ను ప్లాన్ చేస్తున్న కొరటాల ? first seemed on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.
