విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా మీద కొందరు కావాల్సినంత దుష్ప్రచారం చేశారు. ఈ నెగిటివ్ పోస్టులు చూసిన కొందరు ఆడియెన్స్ మీద వాటి ప్రభావం పడింది. దాంతో వారు థియేటర్స్ లో ఫ్యామిలీ స్టార్ చూడలేకపోయారు. కానీ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చిన సినిమాను చూస్తూ బాగుందని రెస్పాండ్ అవుతున్నారు. అమోజాన్ ప్రైమ్ వీడియోలో ఫ్యామిలీ స్టార్ స్ట్రీమింగ్ అవుతోంది. బయట కొందరు క్రియేట్ చేసిన బ్యాడ్ గా సినిమా లేదని, వన్ టైమ్ వాచబుల్ మూవీ అంటూ నెటిజన్స్ స్పందిస్తున్నారు.

నెగిటివ్ ప్రాపగండా చూసి సినిమాను థియేటర్స్ లో చూడలేదని, ఇలాంటి కంటెంట్ థియేటర్ లో ఇంకా బెటర్ గా ఎంజాయ్ చేయొచ్చనే అభిప్రాయం ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తున్నారు. ఇకపై విజయ్ సినిమాలను థియేటర్ లో చూసే జడ్జ్ చేయాలని వారు అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఫ్యామిలీ కోసం నిలబడే ఒక ఫ్యామిలీ మెంబర్ లవ్, ఎఫెక్షన్ ను ఫ్యామిలీ స్టార్ లో చూపించారనేే అప్రిషియేషన్స్ ఈ సినిమాకు దక్కుతున్నాయి.