టాలీవుడ్ నుంచి ఈ ఇయర్ వస్తున్న మరో ప్రెస్టీజియస్ మూవీ పుష్ప 2. సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఫినిషింగ్ స్టేజ్ లో ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ సినిమా చిత్రీకరణ జరుపుతున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ అండ్ ఫైటర్స్ తో ఓ క్రేజీ సీక్వెన్స్ ప్లాన్ చేస్తున్నారు సుకుమార్. నీటి అడుగున ఈ ఫైట్ సీక్వెన్స్ ఉంటుందని తెలుస్తోంది. ఇది సినిమాకు హైలైట్ అయ్యేలా రూపొందిస్తున్నారట.

పుష్ప 2 సినిమా ఆగస్టు 15న ఈ సినిమా గ్రాండ్ గా వరల్డ్ వైడ్ రిలీజ్ కు రాబోతోంది. ఈ సినిమాకు పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ ఏర్పడింది. ఇది పుష్ప ప్రీ రిలీజ్ బిజినెస్ లో క్లియర్ గా కనిపిస్తోంది. రిలీజ్ కు ముందే భారీ ప్రాఫిట్ నెంబర్స్ చూస్తోంది పుష్ప 2. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. రేపు ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుంది.