లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో సలార్ రిలీజ్ తర్వాత కొంత లీజర్ టీమ్ తీసుకున్న ప్రభాస్..ఇప్పుడు మళ్లీ బాగా బిజీ అయ్యారు. కల్కి బ్యాలెన్స్ షూటింగ్ ఫినిష్ చేసిన ప్రభాస్ ఇప్పుడు రాజా సాబ్ సెట్ లో జాయిన్ అయ్యారు. ఓ రొమాంటిక్ సాంగ్ షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా లాంగ్ షెడ్యూల్ కొనసాగుతోంది. ఈసారి రాజా సాబ్ కు ఇచ్చిన డేట్స్ పూర్తి చేసిన తర్వాత సలార్ 2 షూటింగ్ కు వెళ్లనున్నారు రెబల్ స్టార్.

సలార్ 2 శౌర్యంగ పర్వ షూటింగ్ కోసం అంతా సిద్ధమైంది. మే సెకండ్ వీక్ నుంచి షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. సలార్ ప్రభాస్ కెరీర్ లో స్పెషల్ మూవీ అనుకుంటే..ఈ సీక్వెల్ మరింత క్రేజీగా ఉండబోతోంది. హోంబలే ఫిలింస్ బ్యానర్ లో దర్శకుడు ప్రశాంత్ నీల్ సలార్ ను తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్ భారీ లైనప్ లో స్పిరిట్ కూడా ఉంది. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది.