ఎన్నికల ప్రచారానికి తన సినిమాలను బాగా యూజ్ చేస్తున్నారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఇప్పటికే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి ఈ పొలిటికల్ టీజర్ కట్ చేసి రిలీజ్ చేయగా..ఇప్పుడు హరి హర వీరమల్లు సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేయబోతున్నారు. ధర్మం కోసం యుద్ధం అనే క్యాప్షన్ తో హరి హర వీరమల్లు సినిమా టీజర్ ను మే 2న ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నారు.

ఇవాళ మేకర్స్ ఈ అనౌన్స్ మెంట్ చేశారు. ఉస్తాద్ టీజర్ లో జనసేన పార్టీ గురించి, పార్టీ గుర్తు గ్లాస్ గురించి డైలాగ్స్ ఉన్నాయి. హరి హర వీరమల్లులో ఎలాంటి పొలిటికల్ టీజర్ కట్ చేస్తున్నారో అనేది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాను ఏఎరత్నం నిర్మాణంలో దర్శకుడు క్రిష్ రూపొందిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ కొత్త పోస్టర్ లో డైరెక్టర్ క్రిష్ పేరు లేకపోవడం కొసమెరుపు