రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి సినిమా భారీ స్టార్ కాస్టింగ్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఇటీవలే జూన్ 27గా అనౌన్స్ చేశారు. రిలీజ్ డేట్ ప్రకటించినప్పటి నుంచి సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసే పనితో పాటు ప్రచార కార్యక్రమాలూ మొదలుపెట్టారు. రీసెంట్ గా అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ లుక్ ను రిలీజ్ చేశారు. ఆయన అశ్వత్థామగా ఎలా ఉండబోతున్నాడో రివీల్ చేశారు.

ఇక ఇప్పుడు మరో కీలక పాత్ర చేస్తున్న స్టార్ కమల్ హాసన్ క్యారెక్టర్ లుక్ రిలీజ్ చేస్తారని టాక్ వినిపిస్తోంది. మహాభారత కాలం నుంచీ మొదలయ్యే ఈ సినిమా కథలో కమల్ హాసన్ కంసుడిగా నటిస్తున్నారట. నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ఇదే అప్డేట్ ను ఇస్తున్నట్లు టాక్ మొదలైంది. డార్లింగ్స్ చిన్న సర్ ప్రైజ్ అంటూ వైజయంతీ మూవీస్ ట్వీట్ చేసింది. ఇది కమల్ క్యారెక్టర్ గురించే అంటున్నారు.