తిండిబోతు దెయ్యం అనే పేరుతో యూట్యూబ్ లో యానిమేషన్ వీడియోస్ పాపులర్ అయ్యాయి. మిలియన్స్ కొద్దీ వ్యూస్ ఈ తిండిబోతు దెయ్యం వీడియోస్ కు వస్తుంటాయి. ఇదే పేరుతో ఇప్పుడు సినిమా ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని శ్రీ శౌర్య క్రియేషన్స్ తమ ప్రొడక్షన్ నెం.1గా నిర్మిస్తోంది. నరసింహ బోదాసు, మోనికా సమత్తార్, తన్నీరు వాసవి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని తన స్వీయ దర్శకత్వంలో నరసింహ బోదాసు తెరకెక్కిస్తున్నారు.

ఇవాళ హైదరాబాద్ లో జరిగిన తిండిబోతు దెయ్యం సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీనియర్ డైరెక్టర్ రేలంగి నరసింహారావు అతిథిగా హాజరయ్యారు. కామెడీ మూవీస్ ఎప్పుడూ వర్కవుట్ అవుతాయని, దానికి హారర్ ఎలిమెంట్స్ కలిపిన సినిమాకు సక్సెస్ తప్పకుండా దక్కుతుందని ఈ సందర్భంగా రేలంగి నరసింహారావు అన్నారు.

నిర్మాత, దర్శకులు, హీరో ‘నరసింహ బోదాసు’ మాట్లాడుతూ..కొన్నేళ్ల పాటు ఇండస్ట్రీలో నిలదొక్కుకుని మంచి చిత్రాలు నిర్మించాలని నూతన చిత్రనిర్మాణ సంస్థ శ్రీ శౌర్య క్రియేషన్స్ ను స్థాపించాం. ప్రొడక్షన్ నెం.1గా ‘తిండిబోతు దెయ్యం’ ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాం. ఈ సినిమాలో కొత్తదనం ఉంటుంది. అని చెప్పారు.