పవన్ కల్యాణ్ నటిస్తున్న హరి హర వీరమల్లు సినిమా నుంచి డైరెక్టర్ క్రిష్ తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఆరేళ్లుగా సాగుతున్న ఈ సినిమా షూటింగ్ తో విసిగిపోయిన క్రిష్ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ రూమర్స్ కు ఊతమిచ్చేలా తాజాగా హరి హర వీరమల్లు టీజర్ అప్డేట్ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ లో దర్శకుడి పేరు లేదు. పవన్ కల్యాణ్ ఇన్ అండ్ యాస్ అంటూ ప్రొడక్షన్ పేరు, నిర్మాత పేరు మాత్రమే పోస్టర్ లో వేశారు. డైరెక్టర్ క్రిష్ పేరు తొలగించారు.

దీంతో పవన్ సినిమాను క్రిష్ వదిలేశాడనే వదంతులకు బలం చేకూరుతోంది. హరి హర వీరమల్లు సినిమాను మొదలుపెట్టిన క్రిష్..అది వదిలేసి వకీల్ సాబ్, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ వంటి సినిమాల షూటింగ్స్ చేస్తూ వస్తున్నాడు. హరి హరకు మాత్రం డేట్స్ ఇవ్వడం లేదు. పవన్ షూటింగ్ చేయకున్నా క్రిష్ ఓపికగా ప్రాజెక్ట్ తో ట్రావెల్ చేశాడు. ఇటీవలే అనుష్కతో ఘాటి అనే లేడీ ఓరియెంటెడ్ మూవీ బిగిన్ చేశాడు. క్రిష్ విసిగిపోయి హరి హర వదిలేశాడని అనుకోవచ్చు.