Sat. May 9th, 2026

విడుదల తేదీ : మే 8, 2026

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : సుమంత్ ప్రభాస్, జగపతి బాబు, నిధి ప్రదీప్, రాజీవ్‌కనకాల, లైలా, దేవిప్రసాద్‌, సుదర్శన్‌, రాజ్‌కుమార్‌ కసిరెడ్డి తదితరులు
దర్శకుడు : సుభాష్ చంద్ర
నిర్మాత : అభినవ్
సంగీతం : నాగవంశీకృష్ణ
ఛాయాగ్రహణం : సాయిసంతోష్‌
కూర్పు : అనిల్ కుమార్

సంబంధిత లింక్స్ :  ట్రైలర్ 

యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ రూరల్ లవ్, ఫ్యామిలీ డ్రామా ‘గోదారి గట్టుపైన’తో అలరించబోతున్నారు. సుభాష్ చంద్ర దర్శకత్వంలో రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించింది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :

రాజు (సుమంత్ ప్రభాస్) ఒక ఆటో డ్రైవర్. స్నేహితులతో సరదాగా గడుపుతూ లైఫ్ ను లీడ్ చేస్తున్న ఓ మంచి అబ్బాయి ఈ రాజు. ఇలాంటి రాజు మాయ (నిధి ప్రదీప్)ని చూసి ప్రేమలో పడతాడు. మాయ కూడా అతనితో ప్రేమలో పడుతుంది. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో.. మాయ – రాజు ప్రేమకు అడ్డు వస్తాడు మాయ తండ్రి (జగపతి బాబు). కూతురి జీవితాన్ని గొప్పగా ఊహించుకున్న అతను రాజు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు ?, ఇంతకీ.. రాజు తండ్రికూతుర్ల ప్రేమను ఎలా అర్ధం చేసుకున్నాడు ?, అసలు రాజు ఎందుకు తాను ప్రేమించిన మాయకి దూరం కావాలనుకున్నాడు ?, చివరకు మాయ – రాజు ఒక్కటి అయ్యారా ?, లేదా ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

ఓ సగటు తండ్రి.. ముఖ్యంగా ఆడపిల్ల తండ్రి తాలూకు ఎమోషన్ ను సినిమాలో చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు. అసలు ఒక తండ్రి తన కూతుర్ని మిస్ అవుతున్న మూమెంట్ ను, అలాగే ప్రేమించిన వ్యక్తి దూరం అవుతున్న క్రమంలో కలిగే బాధను బాగా చూపించారు. మొత్తానికి ఈ క్రమంలో వచ్చే డ్రామా కూడా బాగుంది. ముఖ్యంగా జగపతి బాబు తాలూకు పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ సీన్స్ బాగున్నాయి. ఈ మధ్యలో హీరో – హీరోయిన్ వైపుకు కథ టర్న్ అవ్వడం ఆకట్టుకుంది. వీటితో ఫ్యామిలీ డ్రామా, కొన్ని ఎమోషనల్ సీన్స్, ప్రధానంగా సుదర్శన్ కామెడీ డైలాగ్స్ ఈ సినిమాకు అదనపు ఆకర్షణ.

సుమంత్ ప్రభాస్ ఈ సినిమాతో తన నటనతో కూడా ఆకట్టుకున్నాడు. తన శైలి కామెడీ టైమింగ్ తో పాటు ఎమోషనల్ ఎలిమెంట్స్ ను కూడా బాగా పలికించాడు. ముఖ్యంగా తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు వేరియేషన్స్
చూపిస్తూ.. సుమంత్ ప్రభాస్ నటించిన విధానం ఆకట్టుకుంది. హీరోయిన్ గా నిధి ప్రదీప్ తన నటనతో అలరించింది. ఇక మిగిలిన నటీనటుల పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. మరో ప్రధాన పాత్రలో నటించిన జగపతి బాబు తన పాత్రలో ఒదిగిపోయారు. సీరియస్ సిచ్యుయేషన్స్ లో కూడా తన టైమింగ్ తో ఆయన తన పాత్రను చాలా బాగా పండించారు.

మరో కీలక పాత్రలో కనిపించిన రాజీవ్‌ కనకాల నటన కూడా బాగుంది. ఇతర కీలక పాత్రల్లో నటించిన లైలా, దేవిప్రసాద్‌, సుదర్శన్‌, రాజ్‌కుమార్‌ కసిరెడ్డి మరియు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు.

మైనస్ పాయింట్స్ :

జగపతి బాబు పాత్రను, ఆ పాత్ర తాలూకు ఎమోషనల్ సీన్స్ ను బాగా డిజైన్ చేసుకున్న దర్శకుడు సుభాష్ చంద్ర, అంతే స్థాయిలో కథనాన్ని , ఆ కథనం గమనాన్ని జనరంజకంగా క్రియేట్ చేయలేకపోయాడు. అలాగే, కొన్ని కీలక సన్నివేశాలను ఆసక్తికరమైన కథనాన్ని రాసుకోవడంలో ఆయన కొన్ని చోట్ల విఫలం అయ్యారు. మొత్తానికి సెకండాఫ్ స్క్రీన్ ప్లేతో పాటు ప్రధాన పాత్రలను ఇంకా బలంగా రాసుకుని ఉండి ఉంటే సినిమాకి మేలు జరిగేది. మొత్తమ్మీద ఈ గోదారి గట్టుపైన కథలో ఉన్న కాన్ ఫ్లిక్ట్ ను అయితే బాగా ఎస్టాబ్లిష్ చేశారు.

ఐతే, కాన్ ఫ్లిక్ట్ కి తగ్గట్టు సీన్స్ ను కూడా ఇంకా బలంగా రాసుకోవాల్సింది. నిజానికి సెకండ్ హాఫ్ లో ఆసక్తికరమైన ఎమోషనల్ సీన్స్ తో కథనాన్ని నడిపినా.. కొన్ని చోట్ల మాత్రమే ఆ ఎమోషన్ వర్కౌట్ అయింది. హీరో – జగపతి బాబు మధ్య డ్రామాలో ఇంకా ఇంట్రెస్ట్ గా బిల్డ్ చేసి ఉంటే బాగుండేది. అటు క్లైమాక్స్ లో కూడా ఉత్సుకత మిస్ అయ్యింది. కథనాన్ని ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నప్పటికీ, దర్శకుడు మాత్రం తన శైలిలోనే సినిమాని ముగించారు.

సాంకేతిక విభాగం :

దర్శకుడు సుభాష్ చంద్ర తన టేకింగ్ తో మెప్పించినా.. తీసుకున్న స్టోరీ లైన్ కి పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా ఆయన స్క్రీన్ ప్లేను రాసుకోలేకపోయారు. సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సంగీత దర్శకుడు నాగవంశీకృష్ణ అందించిన పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను చాలా బ్యూటిఫుల్ గా చిత్రీకరించారు. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే.. అక్కడక్కడ ఉన్న కొన్ని సాగతీత సీన్స్ ను ఎడిటర్ తగ్గించాల్సింది. నిర్మాత అభినవ్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

తీర్పు :

“గోదారి గట్టుపైన’’ అంటూ ఎమోషనల్ లవ్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ చిత్రంలో.. మెయిన్ థీమ్, ప్రేమ సన్నివేశాలు అండ్ ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. సుమంత్ ప్రభాస్, జగపతి బాబు నటన కూడా చాలా బాగుంది. ఐతే, కొన్ని రెగ్యులర్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ సినిమాలో కొన్ని లవ్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ మాత్రమే ఆకట్టుకుంటాయి.

123telugu.com Ranking: 2.75/5

Reviewed by way of 123telugu Staff 

Click on Right here For English Assessment

The publish సమీక్ష : గోదారి గట్టుపైన – కొన్ని చోట్ల మెప్పించే ఫ్యామిలీ ఎంటర్ టైనర్! first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.