Fri. Jul 31st, 2026

విడుదల తేదీ : జూలై 30, 2026

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : జై కృష్ణ, రాషా తడాని, మోహన్ బాబు, శ్యామ్, బ్రహ్మాజీ, నరేష్ తదితరులు
దర్శకత్వం : అజయ్ భూపతి
సంగీతం : జీవి ప్రకాష్ కుమార్
నిర్మాత : పి. కిరణ్
ఛాయాగ్రహణం : జయకృష్ణ గుమ్మడి
కూర్పు : మాధవ్ కుమార్ గుళ్లపల్లి

సంబంధిత లింక్స్ : ట్రైలర్

ఈ వారం థియేటర్స్ లో విడుదలకి వచ్చిన చిత్రాల్లో ఘట్టమనేని యువ హీరో జై కృష్ణ, బాలీవుడ్ నటి రాషా తడాని హీరో హీరోయిన్స్ గా తెలుగు సినిమాకి పరిచయం అవుతూ వచ్చిన సినిమా శ్రీనివాస మంగాపురం కూడా ఒకటి. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

అప్పుడే తిరుపతిలో అడుగు పెట్టిన యువకుడు శ్రీను (జై కృష్ణ) అక్కడ పేరుమోసిన పవర్ఫుల్ వ్యక్తి పెద్దిరెడ్డి (శ్యామ్) కూతురు మంగ (రాషా తడాని) ని మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. అలా ఆమెకి దగ్గర కావడం మొదలు పెడతాడు. కానీ ఈ క్రమంలో మంగకి సంబంధించి ఓ షాకింగ్ నిజం దాచబడి ఉంటుంది. దీన్ని పెద్దిరెడ్డి ఎందుకు దాచాడు? అసలు శ్రీను ఎవరు? తనకి మంగకి ముందు ఏమన్నా సంబంధం ఉందా? ఈ మధ్యలో బళ్లారికి చెందిన వెంకటప్పయ్య (మోహన్ బాబు), లక్ష్మీపతి (అజయ్) లకి ఉన్న వాగ్వాదం ఎలాంటి పరిణామాలకు దారి తీసింది? చివరికి శ్రీను తన ప్రేమని గెలిపించుకున్నాడా లేదా అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి.

ప్లస్ పాయింట్స్:

ఈ సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే దర్శకుడు అజయ్ భూపతి ప్లాన్ చేసుకున్న లవ్ ట్రాక్ అందులోని ఎమోషన్స్ అని చెప్పొచ్చు. దానికి అనుగుణంగా ఒక ఘర్షణ పాయింట్ ని కూడా తాను డీసెంట్ గా నడిపించారు. మెయిన్ గా సెకండాఫ్ లో కథనం ఆకట్టుకుంది. లీడ్ జంటపై తను డిజైన్ చేసుకున్న ప్రేమ కథ, అందులోని ఎమోషన్ ని తను బాగా ఆవిష్కరించారు.

ఇక లీడ్ నటీనటులు జై కృష్ణ, రాషాలు చాలా బాగా నటించారు. ఇద్దరి నడుమ లవ్ ట్రాక్ అందులోని ఇంటెన్స్ ఎమోషన్ ని ఇద్దరూ చాలా బాగా పండించారు. జై కృష్ణ అయితే తన ప్రేమ దూరం అయ్యిన తర్వాత చేసిన ఎమోషనల్ పెర్ఫార్మన్స్ చాలా బాగుంది. తన డాన్స్ లు కానీ, యాక్షన్ బాగున్నాయి.

తనతో పాటుగా రాషా కూడా అంతే బాగా నటించి మెప్పించింది. వీరితో పాటుగా మోహన్ బాబు సినిమాకి అదనపు బలాన్ని అందించారు. తన సీనియార్టీ, తనలోని ఇంటెన్స్ పెర్ఫామర్ ఈ కథకి మంచి బలాన్ని చేకూర్చాయి. ఇక వీరితో పాటుగా బ్రహ్మాజీ, నరేష్ లు తమ కామెడీ టైమింగ్ తో అక్కడక్కడా మంచి ఫన్ జెనరేట్ చేసారు. అలాగే కిక్ శ్యామ్, అజయ్ తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేకూర్చారు. ఇక వీటితో పాటుగా కథనంలో కొన్ని ట్విస్ట్ లు డీసెంట్ గా ఉన్నాయి.

మైనస్ పాయింట్స్:

ఈ సినిమా మొదలైన కొన్ని నిమిషాలకే ఇందులోని పాయింట్ ఏంటి అనేది ఓ క్లారిటీ వచ్చేస్తుంది. ఇది మనం మునుపెన్నడూ చూడనిది కాదు. అలానే అక్కడక్కడా కొన్ని సీన్స్ మాత్రం చాలా రొటీన్ అండ్ రెగ్యులర్ గానే సాగాయి.

ఫస్టాఫ్ లో కొంత సమయం తర్వాత కథనం కొంచెం డల్ గా మారినట్లు అనిపిస్తుంది. అలానే సినిమాలో పాటలు కూడా ఎక్కువే ఉన్నాయి. చార్ట్ బస్టర్స్ కాకుండా ఒకటీ రెండు పాటలు మాత్రం ఫ్లోలో కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తాయి. ఇవి లేకుండా కథనాన్ని సీన్స్ తోనే నడిపించి ఉంటే బాగుండేది.

దర్శకుడు ప్లాన్ చేసుకున్న లవ్ అండ్ ఫ్యాక్షన్, పరువు ఎమోషన్స్ లలో ఇంకాస్త బ్యాలెన్సుడ్ గా కథనాన్ని నడిపించి ఉంటే బాగుండు అనిపిస్తుంది.

సాంకేతిక వర్గం:

ఇందులో నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. మేకర్స్ దాదాపు ఆఫ్ లైన్ లోనే షూట్ చేసి ఆడియెన్స్ కి కొంచెం ఆ సెట్ సినిమాల నుంచి రిలీఫ్ ఇచ్చారు. జీవి ప్రకాష్ సంగీతం బాగుంది. పాటలు స్క్రీన్ పై మరింత బాగున్నాయి. జయ కృష్ణా గుమ్మడి అందించిన కెమెరా వర్క్ చాలా బాగుంది. మాధవ్ కుమార్ గుళ్లపల్లి ఎడిటింగ్ బాగానే ఉంది కానీ కొన్ని సీన్స్, పాటల విషయంలో కఠినంగా ఉండాల్సింది.

ఇక దర్శకుడు అజయ్ భూపతి విషయానికి వస్తే.. పైన చెప్పుకున్న వాటికి అదనంగా తన ఆలోచన సినిమాలో బాగుంది. ముఖ్యంగా తన వర్క్ లవ్ ట్రాక్ లో ఇంప్రెస్ చేస్తుంది. అబ్బాయి, అమ్మాయి ఇద్దరి వెర్షన్ లలోనూ తను రాసుకున్న కథనం మంచి లవ్ డ్రామాలను ఇష్టపడేవారికి కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. అయితే అక్కడక్కడా మాత్రం కొంచెం ఫ్లో మిస్ కావడం, కొన్ని రొటీన్ అంశాలు అంత కొత్తగా అనిపించవు. కానీ లీడ్ జంటకి మాత్రం దర్శకుడుగా మంచి డెబ్యూ తను అందించారు.

తీర్పు:

ఇక మొత్తంగా చూసుకుంటే ఈ ‘శ్రీనివాస మంగాపురం’ అక్కడక్కడా మంచి ఎమోషన్స్ తో సాగే డీసెంట్ లవ్ డ్రామాగా నిలుస్తుంది. లీడ్ జంట తమ మొదటి సినిమా అయినా బాగా చేశారు. అలానే ఇందులో లవ్, ఎమోషన్స్ అక్కడక్కడా యాక్షన్ మూమెంట్స్ కూడా ఆకట్టుకున్నాయి. కానీ కొంచెం రొటీన్ ప్లాట్, కొన్ని రెగ్యులర్ మూమెంట్స్ మాత్రం ఇందులో బలహీనంగా అనిపించాయి. ఇవి పక్కన పెడితే ఈ ఎమోషనల్ లవ్, యాక్షన్ డ్రామా ఓకే అనిపిస్తుంది.

123telugu.com Ranking: 2.75/5

Reviewed by way of 123telugu Staff

Click on Right here For English Evaluation

The put up సమీక్ష: శ్రీనివాస మంగాపురం – కొంతమేర మెప్పించే యాక్షన్, లవ్ డ్రామా first gave the impression on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.