Sat. May 9th, 2026
Sharwanand: శర్వానంద్ నెక్స్ట్ మూవీ కోసం ప్రామిసింగ్ ప్రొడ్యూసర్.. ఎవరంటే..?

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ గురించి పరిచయం అక్కర్లేదు. రీసెంట్ గా ‘బైకర్’ మూవీతో హిట్ అందుకున్న ఈ హీరో, శ్రీను వైట్ల దర్శకత్వంలో భారీ కామెడీ ఎంటర్టైనర్‌కు మూవీతో రాతోతున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక కీలక మార్పు జరిగింది.. ఈ ప్రాజెక్ట్‌ను మొదట మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల వారు ఈ చిత్రం నుండి తప్పుకున్నారు. ఇప్పుడు ఈ బాధ్యతను ప్రామిసింగ్ ప్రొడ్యూసర్ అనిల్ సుంకర స్వీకరించారు. గతంలో శ్రీను వైట్లతో కలిసి ‘దూకుడు’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అనిల్ సుంకర, ఇప్పుడు శర్వానంద్‌తో కలిసి మరో భారీ హిట్‌పై కన్నేశారు.

ఇక శ్రీను వైట్ల తన వింటేజ్ శైలిలో శర్వానంద్ మార్కు కామెడీ టైమింగ్‌కు సరిపోయేలా ఒక హిలేరియస్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. చాలా కాలంగా సరైన సక్సెస్ కోసం చూస్తున్న శ్రీను వైట్ల, ఈ సినిమాతో మళ్ళీ ఫామ్‌లోకి రావాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. శర్వానంద్ కూడా ఈ కథ విన్న వెంటనే చాలా ఉత్సాహం చూపించారని సమాచారం. ప్రస్తుతం శర్వానంద్ ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉన్నప్పటికీ, ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి వచ్చే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది.