ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతున్న ఉత్కంఠభరిత ఆంథాలజీ చిత్రం ‘4వ అధ్యాయం’కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. తమిళంలో ‘అధర్మ కథైగళ్’ పేరుతో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ రివేంజ్ డ్రామాను, ఇప్పుడు ‘న్యాయానికి అతీతం’ అనే పవర్‌ఫుల్ ట్యాగ్‌లైన్‌తో తెలుగు వీక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
ఈ చిత్రంలో వెట్రి, సాక్షి అగర్వాల్, అమ్ము అభిరామి, దివ్య దురైసామి, సునీల్ రెడ్డి కీలక పాత్రలు పోషించారు. బిగ్ బ్యాంగ్ మూవీస్ బ్యానర్‌పై కామరాజ్ వేల్ స్వయంగా నిర్మించి, దర్శకత్వం వహించారు. ప్రతీకారం అనే ప్రధాన ఇతివృత్తంగా నాలుగు విభిన్న కథలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
ప్రతీకారానికి దారితీసే పరిస్థితులు, దాని తదుపరి పరిణామాలు, వ్యక్తుల మానసిక క్షోభను దర్శకుడు ఎంతో సహజంగా, ఎమోషనల్‌గా ఆవిష్కరించారు. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే స్క్రీన్‌ప్లేతో పాటు అద్భుతమైన సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలాలు. ఆహాలో ఈ మూవీకి అన్ని వర్గాల నుంచి ఆదరణ లభిస్తుండటంతో, ఓటీటీలో అత్యధిక వీక్షణలతో విజయవంతంగా దూసుకుపోతోంది.
The submit ఆహాలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ‘4వ అధ్యాయం’ first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.
