ఇళయ దళపతి విజయ్ హీరోగా నటించిన సెన్సేషనల్ సినిమానే జన నాయగన్. దర్శకుడు హెచ్ వినోద్ తెరకెక్కించిన ఈ సినిమా విజయ్ సీఎం అయ్యాక థియేటర్స్ లోకి వచ్చింది. అయితే ఈ సినిమా ఊహించని విధంగా మిక్స్డ్ స్పందన అందుకుంది. ఇదే క్రమంలో తెలుగులో చాలా తక్కువే రెస్పాన్స్ ని నమోదు చేస్తుంది.
అయితే మొత్తం మూడు భాషల్లో విడుదల అయ్యిన ఈ సినిమా తెలుగు కంటే హిందీలోనే ఇప్పుడు డామినేట్ చేయడం ఆశ్చర్యంగా మారింది. గత 24 గంటల్లో బుక్ మై షో బుకింగ్స్ లో తెలుగు వెర్షన్ కి 28 వేల టికెట్స్ సేల్ అయితే హిందీ వెర్షన్ కి మాత్రం 33 వేలు అమ్ముడు పోయాయి. ఇది మాత్రం ఒకింత షాకింగ్ అనే చెప్పాలి. అలాగే విజయ్ మార్కెట్ హిందీలో పెరిగింది అనే చెప్పొచ్చు. ఇక ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందించారు. కే వి ఎన్ సంస్థ నిర్మాణం వహించారు.
The submit ఇంట్రెస్టింగ్.. విజయ్ లాస్ట్ సినిమాకి తెలుగు కంటే హిందీలోనే డామినేషన్! first gave the impression on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Scores.
