మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం “పెద్ది” తో మాస్ కంబ్యాక్ ని తాను కొట్టిన సంగతి తెలిసిందే. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఈ సాలిడ్ మల్టీ స్పోర్ట్స్ డ్రామా సినిమా థియేటర్స్ లో చాలా కాలం తర్వాత మళ్ళీ జనాన్ని రప్పించి పెద్ద హిట్ అయ్యింది. ఇలా మొదటి వారం పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇపుడు రెండో వారాంతం లోకి ఎంటర్ అయ్యింది.
అయితే ఇలా ఎంటర్ అవుతూనే పెద్ది గాడు తన బ్యాటింగ్ షురూ చేసాడని చెప్పొచ్చు. బుక్ మై షోలో ఈ శనివారం బుకింగ్స్ ఆల్రెడీ గంటకి 9 వేలకి పైగా టికెట్ సేల్స్ తో మొదలయ్యాయి. ఇది ఉదయం నుంచే ట్రెండింగ్ కాగా సాయంత్రానికి ఈ నెంబర్స్ పెరిగినా ఎలాంటి ఆశ్చర్యం లేదనే చెప్పొచ్చు. సో ఈ వారాంతంలో పెద్ది వసూళ్లు మరింత స్ట్రాంగ్ గా రావడం అనేది గ్యారెంటీ. ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించగా జాన్వీ కపూర్ రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటించింది. అలాగే వృద్ధి సినిమాస్ నిర్మాణం వహించారు.
The put up ఈ వీకెండ్ లో ‘పెద్ది’ బ్యాటింగ్ షురూ.. మాస్ బుకింగ్స్ తో మొదలు! first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.
