Tue. Apr 21st, 2026

ప్రస్తుతం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా రుక్మిణి వసంత్ హీరోయిన్ గా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “డ్రాగన్” కోసం అందరికీ తెలిసిందే. నెక్స్ట్ లెవెల్ హైప్ ఉన్న ఈ సినిమా దాదాపు మూడేళ్ళ వెనుక అనౌన్స్ అయ్యింది. షూటింగ్ కూడా మొదలై ఏడాదిన్నరకి పైగా దాటింది.

అయినప్పటకీ ఇంకా షూటింగ్ చాలా బ్యాలన్స్ ఉంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ ఏడాది జూన్ లో లాక్ చేశారు కానీ ఈ డేట్ లో వచ్చే సమస్యే లేదు అని ఖరారు అయ్యింది. మరి ఈ మోస్ట్ అవైటెడ్ సినిమా రిలీజ్ ఎప్పుడు? అంటే దీనిపై షాకింగ్ బజ్ వినిపిస్తుంది. దీని ప్రకారం డ్రాగన్ విడుదల కావాలి అంటే ఇంకో ఏడాదిన్నర సమయం ఈజీగా పడుతుంది అని తెలుస్తుంది.

వచ్చే ఏడాదిలో డిసెంబర్ రిలీజ్ కి వచ్చినా ఎలాంటి ఆశ్చర్యం లేదట. మరి షాకింగ్ రూమర్ లో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

The submit ఎన్టీఆర్ ‘డ్రాగన్’ రిలీజ్ పై షాకింగ్ బజ్! first seemed on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.