మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే “పెద్ది”. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా కోసం మెగా అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ చిత్రాన్ని ఇంకా సరిగ్గా ప్రమోషన్స్ చేయడం లేదు అనే బాధ అభిమానులని తొలిచేస్తోంది.
ఇది మల్టీ స్పోర్ట్స్ డ్రామా పైగా క్రికెట్ కూడా ఉంది. అయితే ఈ క్రికెట్ ఫ్యాక్టర్ నే మేకర్స్ ఇప్పుడు నడుస్తున్న సరైన సీజన్ లో వినియోగించుకోలేకపోతున్నారు అని అభిమానులు వాపోతున్నారు. ఐపీఎల్ సీజన్ లో పెద్ది సినిమాకి మినిమమ్ ప్రమోషన్స్ కూడా మేకర్స్ సైడ్ నుంచి లేకపోవడంతో పాన్ ఇండియా లెవెల్లో బిగ్ ఛాన్స్ ని మిస్ చేసుకుంటున్నారని వారు అంటున్నారు.
ఒకరకంగా ఇది కూడా నిజమే కానీ రీసెంట్ గానే సినిమా కొత్త డేట్ లాక్ అయ్యింది. ఇప్పటికీ మించి పోయింది లేదు ఈ నెలాఖరు వరకు టైం ఉంది కాబట్టి ఇప్పుడు ఈ స్టెప్ తీసుకున్నా సినిమాకి మంచి బూస్టప్ ఇచ్చినట్టే అవుతుంది. సో వీటిని కూడా మేకర్స్ స్టార్ట్ చేస్తారా లేదా అనేది వేచి చూడాలి.
The put up ఐపీఎల్ సీజన్ ని బిగ్ మిస్ చేసుకున్న ‘పెద్ది’ టీం! first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Rankings.
