Thu. Jun 25th, 2026

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన క్రేజీ ప్రాజెక్ట్ “ఓజి” ని ఫ్యాన్స్ అంత తేలిగ్గా మర్చిపోలేరు. ఈ సినిమా విడుదలకి ముందు ఉన్న యుఫోరియా అంతా ఇంత కాదు.

అదే ఊపులో వచ్చి రికార్డు ప్రీమియర్స్ సహా ఓపెనింగ్స్ ని ఈ సినిమా రాబట్టింది. ఇప్పుడు పార్ట్ 2 పై ఏ చిన్న అప్డేట్ వచ్చినా సోషల్ మీడియా అంతా షేక్ అవుతుంది. ఇలా లేటెస్ట్ గా మరో సెన్సేషనల్ బజ్ ఓజి 2 పై ఇపుడు వైరల్ గా వినిపిస్తుంది. పవన్ ఈ ఏడాది నవంబర్ నుంచే షూట్ కి డేట్స్ ఇచ్చినట్టు టాక్.

సో నవంబర్ నుంచే షూట్ మొదలు పెట్టనుండగా ఈసారి మొదటి సినిమాలా కాకుండా ఇతర దేశాల్లో షూట్ కి కూడా తాను పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే ఓజి 2 పై అధికారిక బిగ్ అప్డేట్ మాత్రం ఈ సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కానుకగా వెలువడే అవకాశం ఉన్నట్టుగా వినిపిస్తుంది. సో దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

The publish ‘ఓజి 2’ పై సెన్సేషనల్ బజ్.. పవన్ డేట్స్ అప్పటి నుంచే? first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Rankings.