Thu. Jun 25th, 2026

ముఖ్య అంశాలు

  • మీరట్‌కు చెందిన సంకేత్ కుమార్ 2021లో కేవలం రెండు మార్కుల తేడాతో జేఈఈ అడ్వాన్స్‌డ్ అర్హత కోల్పోయాడు.
  • ఎలాంటి కోచింగ్ లేకుండా, యూట్యూబ్ పాఠాలతో సొంతంగా ప్రిపేర్ అయి ఐఐఎస్‌టీ(IIST)లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ సీటు సాధించాడు.
  • తాజాగా ఇస్రోలో సైంటిస్ట్/ఇంజనీర్‌గా ఎంపికై, తన కుటుంబానికి ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చాడు.

జీవితంలో ఒక చిన్న అపజయం ఎదురవగానే చాలామంది నీరుగారిపోతారు. కానీ, అదే ఓటమిని పునాదిగా చేసుకుంటే ఎలాంటి అద్భుతాలు సాధించవచ్చో ఉత్తరప్రదేశ్‌ మీరట్‌కు చెందిన సంకేత్ కుమార్ నిరూపించాడు. 2021లో కేవలం రెండు మార్కుల తేడాతో జేఈఈ అడ్వాన్స్‌డ్ (JEE Complicated) క్వాలిఫై అయ్యే అవకాశాన్ని తృటిలో కోల్పోయాడు. ఆ సమయంలో ఏడాది పాటు డ్రాప్ తీసుకోవద్దని ఎంతోమంది సలహా ఇచ్చినా అతడు వినలేదు. తన లక్ష్యం మీద ఉన్న నమ్మకంతో మళ్లీ పుస్తకాలు పట్టాడు. కట్ చేస్తే.. ఇప్పుడు ఏకంగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)లో సైంటిస్ట్‌గా ఎంపికై సత్తా చాటాడు.

కోచింగ్ లేకుండా.. యూట్యూబ్ పాఠాలతో

సంకేత్ విజయం వెనుక ఎలాంటి ఖరీదైన కోచింగ్ సెంటర్లు లేవు. కేవలం యూట్యూబ్ క్లాసులు, పాత ప్రశ్నపత్రాలు, సొంత కష్టం.. ఇవే అతడి ఆయుధాలు. ఆ పట్టుదలతోనే తర్వాతి ఏడాది జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్ పరీక్షలను క్లియర్ చేశాడు. తిరువనంతపురంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ (IIST)లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ సీటు సాధించాడు.

అక్కడ కూడా అతడి రూటే సపరేట్. తోటి విద్యార్థులంతా ఏరోడైనమిక్స్, ప్రొపల్షన్ వంటి సబ్జెక్టులు ఎంచుకుంటే.. సంకేత్ మాత్రం ‘వైబ్రేషన్స్ అండ్ అకౌస్టిక్స్’ వైపు మొగ్గుచూపాడు. తన బ్యాచ్‌లో ఈ సబ్జెక్ట్ ఎంచుకున్న ఏకైక విద్యార్థి అతడే. బీటెక్ చదువుతున్న సమయంలోనే జపాన్‌కు చెందిన ‘షిన్‌రా’ (Shinra Inc) కంపెనీలో మూడు నెలల పాటు ఓ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేశాడు.

అమ్మానాన్నలకు సర్‌ప్రైజ్

ఐఐఎస్‌టీలో 8.2 సీజీపీఏ సాధించిన వెంటనే సంకేత్‌కు ఇస్రో ఇంటర్వ్యూ కోసం పిలుపు వచ్చింది. ఉద్యోగం కచ్చితంగా వస్తుందో రాదో అన్న సందేహంతో ఇంట్లో వాళ్లకు కూడా చెప్పకుండా వెళ్లి ఇంటర్వ్యూకి హాజరయ్యాడు. తీరా ఇస్రో సైంటిస్ట్‌గా కొడుకు ఎంపికయ్యాడన్న విషయం తెలియగానే అతడి తల్లిదండ్రులు సునీతా సింగ్, గుల్షన్ కుమార్‌ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. డ్రాప్ తీసుకున్న సమయంలో అందరూ రకరకాలుగా మాట్లాడినా, తన కుటుంబం మాత్రం కొండంత అండగా నిలబడిందని, ముఖ్యంగా తన సోదరుడు హర్షిత్ ఆర్థికంగా ఎంతో సాయం చేశాడని సంకేత్ గుర్తుచేసుకున్నాడు.

మహేంద్రగిరిలోని ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్‌లో రాకెట్ సిస్టమ్స్ ఫైనల్ టెస్టింగ్ విభాగంలో అతడు తన కెరీర్ ప్రారంభించనున్నాడు. పిల్లల మీద నమ్మకం ఉంచి ప్రోత్సహిస్తే, వాళ్లే తమ సక్సెస్ స్టోరీలను లిఖించుకుంటారని ఈ ఇస్రో శాస్త్రవేత్త కుటుంబం గర్వంగా చెబుతోంది.

The publish ఓటమి నుంచి ఇస్రో దాకా : 2 మార్కులతో జేఈఈ మిస్.. యూట్యూబ్ క్లాసులతోనే ఇస్రో సైంటిస్ట్‌గా ఎంపిక! first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Rankings.