త్రివిక్రమ్ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘గాడ్ ఆఫ్ వార్’. పైగా ఎన్టీఆర్ తో ‘అరవింద సమేత’ తర్వాత త్రివిక్రమ్ చేస్తున్న సినిమా ఇదే. ఐతే, ఈ సినిమా గురించి తాజాగా వినిపిస్తున్న రూమర్ ప్రకారం.. ఈ సినిమాలో ఓ సీనియర్ హీరో గెస్ట్ రోల్ లో నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ పాత్ర చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని.. ఈ పాత్రలో ఓ బాలీవుడ్ హీరో నటిస్తాడని టాక్ నడుస్తోంది. అలాగే, మరికొన్ని అతిథి పాత్రలు కూడా ఉన్నాయట. దేవుళ్ల పాత్రల రూపంలో ఈ అతిథి పాత్రల వస్తాయట.
కాగా ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం అత్యంత భారీ స్థాయిలో రూపొందుతోంది. నటీనటులు మరియు సాంకేతిక బృందానికి సంబంధించిన మరిన్ని వివరాలు రాబోయే రోజుల్లో వెల్లడి కానున్నాయి. ఈ భారీ మైథలాజికల్ ప్రాజెక్ట్ పై ఇప్పటికే భారీగా బజ్ క్రియేట్ అయింది. మరి స్పెషల్ రోల్స్ లో స్టార్లు కూడా కనిపిస్తే ఆ బజ్ ఇంకా పెరుగుతుంది.
The publish ‘గాడ్ ఆఫ్ వార్’లో మరికొన్ని అతిథి పాత్రలు ! first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.
