సమంత హీరోయిన్‌గా, నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. పైగా ఈ చిత్రం, టాలీవుడ్ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన మహిళా ప్రధాన చిత్రంగా అధికారికంగా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద సమంతకు ఉన్న ఆదరణను ఈ సినిమా మరింత పెంచింది. అటు ఉత్తర అమెరికాలో కూడా మూడో వారాంతంలో $2 మిలియన్ల మార్కును దాటి, ఒక అద్భుతమైన ఘనతను సాధించింది. మూడోవ వారాంతంలో ఈ రేంజ్ చిత్రానికి ఇది ఒక అద్భుతమైన కలెక్షన్స్ కింద లెక్కే.
మొత్తానికి వచ్చే వారం కూడా ఈ సినిమా బలమైన వసూళ్లను నమోదు చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో గుల్షన్ దేవయ్య, దిగంత్ మంచాలే, గౌతమి, శ్రీముఖి తదితరులు కీలక పాత్రలు పోషించారు. కాగా సమంత భర్త రాజ్ నిడిమోరు మాట్లాడుతూ.. మరో రెండేళ్లలో ఈ సినిమాకు సీక్వెల్ రాబోతున్నట్లు ప్రకటించారు. ఒక సినిమాకు పార్ట్-2 చేయాలనే ఇన్‌స్పిరేషన్ తనకు కలగడం ఇదే తొలిసారి అని, రాబోయే చిత్రం డబుల్ ఫన్, డబుల్ ఎక్సైట్‌మెంట్‌తో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ చిత్రానికి సంగీతాన్ని సంతోష్ నారాయణన్ అందించారు.
The publish ‘మా ఇంటి బంగారం’ : టాలీవుడ్ చరిత్రలోనే రికార్డు ! first seemed on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.
