Sun. Jul 5th, 2026

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్టార్ లైనప్‌ లో భారీ అంచనాలు ఉన్న సినిమా ‘స్పిరిట్’. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఓ పవర్‌ ఫుల్ కాప్ స్టోరీగా రాబోతుంది. ఈ సినిమాలో త్రుప్తి దిమ్రిని హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసం భారీ సెట్స్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సీక్వెన్స్ లో ప్రభాస్ పై భారీ ఫైట్ తీస్తారట. అన్నట్టు ఈ సీక్వెన్స్ లో ప్రభాస్ తో పాటు దాదాపు వంద మంది ఫైటర్స్ కూడా ఈ సీక్వెన్స్ లో కనిపిస్తారట. ఈ షెడ్యూల్ తర్వాత చేయనున్న మరో షెడ్యూల్ లో క్లైమాక్స్ ను షూట్ చేయనున్నారు.

కాగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాలో యాక్షన్ అద్భుతంగా ఉంటుందట. ఇప్పటికే, విడుదలైన ఈ సినిమా పోస్టర్ ప్రేక్షకుల్లో భారీ బజ్‌ని సృష్టించింది. ప్రభాస్ లుక్ కూడా పక్కా వైల్డ్ అండ్ మాస్ అవతార్ లో లో ఉంది. కాగా మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ తో సందీప్‌ రెడ్డితో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా పూర్తి చేశాడు. ఈ చిత్రాన్ని టి-సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ భారీ స్థాయిలో నిర్మించనున్నాయి. అన్నట్టు ‘స్పిరిట్‌’ మెయిన్ కథాంశమే చాలా కొత్తగా ఉంటుందని.. సందీప్ రెడ్డి వంగా నుంచి మరో వినూత్న సినిమా రాబోతుంది.

The put up ‘స్పిరిట్’ ఇంటర్వెల్ పై క్రేజీ న్యూస్ ? first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Rankings.