టాలీవుడ్ ప్రముఖ సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ రామ్ కొణికి స్కిన్ కేర్ రంగంలోకి అడుగుపెట్టారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ (రోడ్ నెంబర్ 45)లోని తన సలూన్ వద్దే “కొణికి లక్స్” (Koniki Lux) పేరిట ఏర్పాటు చేసిన నూతన స్కిన్ కేర్ క్లినిక్‌ను ప్రముఖ నటుడు జగపతిబాబు లాంఛనంగా ప్రారంభించారు. డెర్మటాలజిస్ట్ డాక్టర్ అలేఖ్య రెడ్డి నేతృత్వంలో అధునాతన టెక్నాలజీ, సర్టిఫైడ్ పరికరాలతో ఈ క్లినిక్ అత్యాధునిక సేవలు అందించనుంది.
ఈ సందర్భంగా జగపతిబాబు మాట్లాడుతూ.. ‘లెజెండ్’ సినిమాతో మొదలైన తన సెకండ్ ఇన్నింగ్స్ నుంచి రామ్ కొణికితో తన ప్రయాణం కొనసాగుతోందని తెలిపారు. తన ప్రతి హెయిర్ స్టైల్ రామ్ చేసినదేనని, ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ నైపుణ్యం చాటడం అతని ప్రత్యేకత అని ప్రశంసించారు. అత్యంత ఆత్మీయుడైన రామ్ ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉందన్నారు.
నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో అత్యంత సురక్షితంగా చర్మ సంరక్షణ సేవలు అందిస్తామని రామ్ కొణికి పేర్కొన్నారు. త్వరలో దేశవ్యాప్తంగా ఇతర మెట్రో నగరాలకు తమ సేవలను విస్తరిస్తామన్నారు. భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ, క్లయింట్ల చర్మ తత్వాన్ని బట్టి వ్యక్తిగత ప్రోటోకాల్ ప్రకారం సర్టిఫైడ్ పరికరాలతో చికిత్స అందిస్తామని డాక్టర్ అలేఖ్య రెడ్డి స్పష్టం చేశారు.
The publish జగపతిబాబు చేతుల మీదుగా ‘కొణికి లక్స్’ స్కిన్ కేర్ ప్రారంభం first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Rankings.
