టాలీవుడ్‌లో గత రెండు రోజులుగా ఒక వార్త ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్ సీఐడీ పోలీసులు ఒక పాపులర్ టాలీవుడ్ నిర్మాతను అరెస్ట్ చేసేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయం తెలిసిన సదరు నిర్మాత ప్రస్తుతం పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే అరెస్ట్ చేయడానికి గల అసలు కారణం ఇంకా అధికారికంగా బయటకు రానప్పటికీ, ఆర్థిక లావాదేవీలు లేదా గత ప్రభుత్వ హయాంలో జరిగిన కొన్ని సెటిల్‌మెంట్లే దీనికి కారణమై ఉండవచ్చని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇప్పటికే ఏపీ సీఐడీ బృందం హైదరాబాద్‌లో గాలింపు చేపట్టినట్లు సమాచారం.
Additionally Learn : Varanasi: మహేశ్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ అప్‌డేట్..!
ఈ వార్తలో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. సదరు నిర్మాత టాలీవుడ్ లోని ఒక టాప్ స్టార్ హీరోకు అత్యంత సన్నిహితుడట.. ఆ హీరో సినిమాలకు ఈ నిర్మాత కీలక బాధ్యతలు వహించడమే కాకుండా , వారిద్దిరి మధ్య వ్యాపార సంబంధాలు కూడా ఉన్నాయని టాక్. మరి ఇంతకి అసలు ఆ నిర్మాత ఎవరు? ఆ స్టార్ హీరో ఎవరు? అనే దాని పై చర్చ సోషల్ మీడియాలో జోరుగా కొనసాగుతోంది.
