Tue. Apr 21st, 2026

పార్వతి సినిమాస్ బ్యానర్‌పై నూతన చిత్రం ‘రెటీనా’ ఆదివారం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ఘనంగా ప్రారంభమైంది. అల్లం రాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ (ప్రొడక్షన్ నెం.1) సినిమాలో మనీష్, సోనియా నాయుడు, ప్రీతీ హెస్సోనా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్సవంలో ప్రముఖ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ ముహూర్తపు షాట్‌కు క్లాప్ ఇవ్వగా, ‘రజాకార్’ దర్శకుడు యాట సత్యనారాయణ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తొలి సన్నివేశానికి ‘కమిటీ కుర్రోళ్ళు’ ఫేమ్ యశ్వంత్ పెండ్యాల గౌరవ దర్శకత్వం వహించారు.

​ఈ సందర్భంగా దర్శకుడు యాట సత్యనారాయణ మాట్లాడుతూ, కథ అద్భుతంగా ఉందని, అన్ని వర్గాల ప్రేక్షకులను ఇది అలరిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. అనంతరం దర్శకుడు అల్లం రాజు మాట్లాడుతూ.. ‘రెటీనా’ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమని, ప్రేక్షకులకు ఒక రియల్ ఫీల్ ఇచ్చేలా సాంకేతిక విలువలు, సహజమైన భావోద్వేగాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తామని స్పష్టం చేశారు. ప్రతి యువకుడు తనను తాను ఈ సినిమాలో చూసుకుంటాడని యశ్వంత్ పెండ్యాల పేర్కొన్నారు.

​ఈ చిత్రానికి పార్వతి నిర్మాతగా వ్యవహరిస్తుండగా, పి.కె. రవికుమార్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రవి కె. రెడ్డి సినిమాటోగ్రఫీ, రాకేష్ సంగీతం అందిస్తున్నారు. యోగికత్రి, సతీష్, పూజిత, విజయలక్ష్మి, న్యాయవాది కె.వి.ఎల్. నరసింహారావు తదితరులు ఇందులో ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

The submit తమ్మారెడ్డి భరద్వాజ చేతుల మీదుగా ‘రెటీనా’ చిత్ర ప్రారంభం first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.