Tue. Apr 21st, 2026

మన టాలీవుడ్ లో క్రేజీ కాన్సెప్ట్ థ్రిల్లర్స్ తో అలరించే అతికొద్ది మంది యంగ్ హీరోస్ లో అడివి శేష్ కూడా ఒకరు. అయితే తన నుంచి చాలా కాలం గ్యాప్ తర్వాత వస్తున్న లేటెస్ట్ సినిమానే డెకాయిట్. దర్శకుడు శానియల్ డియో తెరకెక్కించిన ఈ సినిమా ఇంకొన్ని రోజుల్లో థియేటర్స్ లో విడుదల కాబోతుండగా ఈ సినిమా పానిండియా రిలీజ్ పై శేష్ క్లారిటీ ఇచ్చాడు.

ఈ సినిమా కేవలం తెలుగు, హిందీ లలో మాత్రమే విడుదల చేస్తున్నట్టు తెలిపాడు. అలాగే తెలుగు, హిందీ రెండూ దేనికదే సెపరేట్ గా తెరకెక్కించినట్టు అసలు విషయం రివీల్ చేసాడు. సో ఈ సినిమా కేవలం ఈ రెండు భాషలోనే థియేటర్స్ లో వస్తుంది అని చెప్పొచ్చు. ఓటీటీలో మిగతా వెర్షన్స్ కలిపి రావొచ్చు. ఇక ఈ సినిమాలో అనురాగ్ కశ్యప్, లేటెస్ట్ సోషల్ మీడియా సెన్సేషన్ జైన్ మేరీ ఖాన్ తదితరులు కీలక పాత్రల్లో నటించగా అన్నపూర్ణ స్టూడియోస్ వారు నిర్మాణం వహించారు.

The submit దేనికదే.. ‘డెకాయిట్’ పాన్ ఇండియా రిలీజ్ పై శేష్ క్లారిటీ! first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.