Tue. Apr 21st, 2026

గత కొంతకాలంగా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మరియు మృణాల్ ఠాకూర్ మధ్య ప్రేమాయణం సాగుతోందని, వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి. అయితే, ఈ వార్తలపై మృణాల్ ఠాకూర్ ఇటీవల స్పందిస్తూ ఇవన్నీ కేవలం పుకార్లేనని కొట్టిపారేసింది. తనకు ప్రస్తుతం డేటింగ్ చేసే సమయం కూడా లేదని, తన దృష్టి అంతా సినిమాలపైనే ఉందని ఆమె స్పష్టం చేసింది.

ధనుష్‌ను తాను ఎంతో గౌరవిస్తానని, ఆయనను ‘సర్’ అని పిలుస్తానని మృణాల్ పేర్కొంది. ధనుష్ తన సినిమా ప్రీమియర్‌కు రావడంపై స్పందిస్తూ.. అది కేవలం ప్రొడ్యూసర్ ఆహ్వానం మేరకు జరిగినదే తప్ప, మరే ఇతర కారణం లేదని క్లారిటీ ఇచ్చారు. ధనుష్ వంటి ప్రతిభావంతుడైన నటుడితో పనిచేయాలని తనకు ఉందని, ఆయన ఒక గొప్ప ఇన్స్టిట్యూషన్ అని ఆమె కొనియాడింది.

కాగా, వీరిద్దరి వ్యక్తిగత జీవితంపై వస్తున్న రూమర్స్ పక్కన పెడితే.. వృత్తిపరంగా వీరిద్దరూ త్వరలోనే జతకట్టబోతున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ధనుష్ తదుపరి దర్శకత్వం వహించబోయే చిత్రంలో మృణాల్ ఠాకూర్‌ను హీరోయిన్‌గా తీసుకోవాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే, ఈ క్రేజీ కాంబినేషన్ వెండితెరపై ఒక మ్యాజిక్ క్రియేట్ చేయడం ఖాయం. ప్రస్తుతం ధనుష్ నటించిన ‘కర’ చిత్రం ఏప్రిల్ 30న విడుదలకు సిద్ధంగా ఉంది.

The publish ధనుష్‌తో మృణాల్ ఠాకూర్.. కానీ..! first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Rankings.