Tue. Apr 21st, 2026

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘పెద్ది’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలను క్రియేట్ చేసింది. దర్శకుడు బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాతో రామ్ చరణ్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

ఇక ఈ సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు బుచ్చిబాబు మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. అయితే, ఈ పాటకు సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ను సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ వీడియో రూపంలో చేయించాలని మేకర్స్ భావిస్తున్నారట.

ఇప్పటివరకు ఏఆర్ రెహమాన్ ఓ పాట రిలీజ్ అనౌన్స్‌మెంట్ కోసం తెలుగులో వీడియో చేసిన సందర్భాలు తక్కువ. ఆయన చిత్ర ప్రమోషన్స్‌లో కూడా పెద్దగా ఆసక్తి చూపరు. మరి పెద్ది సినిమా కోసం ఆయన తన పద్దతి మార్చుకుంటాడా..? అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమాలో అచ్చియమ్మ పాత్రలో అందాల భామ జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

The submit పెద్ది కోసం బుచ్చిబాబు మాస్టార్ ప్లాన్..? first seemed on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.