పెద్ద సినిమాలు రిలీజైనప్పుడు టికెట్ ధరలను విపరీతంగా పెంచేయడం టాలీవుడ్‌లో పెద్ద మైనస్‌గా మారుతోంది. తాజాగా ‘పెద్ది’ సినిమా విషయంలోనూ ప్రేక్షకుల అసహనాన్ని పట్టించుకోకుండా రేట్లు పెంచేశారు. దీనివల్ల సామాన్య, ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు దూరమవడంతో ఈ చిత్రానికి ఆశించిన స్థాయిలో లాంగ్ రన్ రాలేకపోయింది.
‘పెద్ది’ థియేటర్లలో ఉన్నప్పుడే, సమంత నటించిన ‘మా ఇంటి బంగారం’ సినిమా అందుబాటు ధరలతో, మంచి టాక్‌తో రావడంతో ఫ్యామిలీస్ అటు వైపు మళ్లాయి. సినిమా రన్ అంతా అయిపోయాక ఇప్పుడు తెలంగాణ సింగిల్ స్క్రీన్స్‌లో గరిష్ఠ ధరను రూ.105కి తగ్గించడం వల్ల సినిమాకు వచ్చే లాభం ఏమీ లేదని సినీ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. ఈ నిర్ణయం రెండో వీకెండ్ తర్వాత తీసుకుని ఉంటే బాగుండేది.
ప్రేక్షకులు సినిమాను త్వరగా చూడాలనుకున్నప్పుడు రేట్లు ఎక్కువగా ఉంటున్నాయి, తీరా రేట్లు తగ్గాక “ఇంకొన్ని రోజుల్లో ఓటీటీలో వస్తుంది కదా” అని ఆడియన్స్ రావడం లేదు. ఎంత పెద్ద సినిమా అయినా రెండో వీకెండ్ దాటి నిలబడలేకపోవడానికి ఈ టికెట్ రేట్ల సైకిలే ప్రధాన కారణం. ఇప్పటికైనా రేట్లు అందుబాటులో ఉంచకపోతే పెద్ద సినిమాల వసూళ్లకు గండం తప్పదు.
The publish పెద్ది టికెట్ రేట్లు తగ్గింపు.. ఇప్పుడెందుకు అంటున్న ఫ్యాన్స్..! first seemed on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.
