మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న మల్టీ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. మంచి హైప్ లో ఉన్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు దాదాపు పూర్తి కావస్తోంది కానీ ఇందులో స్పెషల్ సాంగ్ పట్ల ఉన్న సస్పెన్స్ ఇంకా క్లియర్ కాలేదు అన్నట్టే వినిపిస్తోంది. ఈ సాంగ్ కోసం మృణాల్ ఠాకూర్ పేరు మొదటి వరుసలో ఉంటే ఫ్యాన్స్ కూడా ఆమెనే కావాలని డిమాండ్ చేస్తున్నారు.
కానీ తాజాగా మరో గ్లామరస్ హీరోయిన్ పేరు కూడా వినిపించింది. దీనికి అయితే అభిమానులు సోషల్ మీడియాలో ససేమిరా నో చెప్పేస్తున్నారు. అయితే మృణాల్ తప్పితే ఇంకెవరూ వద్దని చెప్పేస్తున్నారు. సో ఈ స్పెషల్ సాంగ్ విషయంలో ఉన్న సస్పెన్స్ ఎప్పటికి వీడుతుందో చూడాలి. ఇక ఈ సినిమాకి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు అలాగే వృద్ధి సినిమాస్ నిర్మాణం వహిస్తున్నారు.
The publish ‘పెద్ది’ స్పెషల్ సాంగ్ పై కొత్త పుకారు.. వద్దంటున్న ఫ్యాన్స్ first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.
