నాచురల్ స్టార్ నాని హీరోగా కయాదు లోహర్ హీరోయిన్ గా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న భారీ సినిమానే ది ప్యారడైజ్. మంచి అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా నిజానికి ఈ మార్చ్ లోనే రావాల్సి ఉంది కాని షూట్ ఇంకా ఇతర పోస్ట్ ప్రొడక్షన్ పనులు బాకీ ఉన్నందున ఆగస్ట్ కి వాయిదా వేశారు. ఇక ఈ సినిమా ఇక్కడ నుంచి కూడా వాయిదా పడింది అని ఏకంగా డిసెంబర్ వరకు షిఫ్ట్ అయ్యింది అంటూ మళ్లీ పలు రూమర్స్ మొదలయ్యాయి.
అయితే దీనిపై లేటెస్ట్ క్లారిటీ వినిపిస్తోంది. ప్యారడైజ్ అనుకున్న సమయం ఆగస్ట్ 27 రేస్ లో ట్రాక్ పైనే ఉందట. చిత్ర యూనిట్ ఆ డేట్ కి ఎట్టి పరిస్థితుల్లో తీసుకుని రావాలనే చూస్తున్నారట. సో ఈ సాలిడ్ ప్రాజెక్ట్ పోస్ట్ పోన్ రూమర్స్ లో ఎలాంటి నిజం లేదనే చెప్పాలి. ఇక ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు అలాగే ఎస్ ఎల్ వి సినిమాస్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.
The publish ‘ప్యారడైజ్’ రిలీజ్ పై లేటెస్ట్ క్లారిటీ! first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.
