Tue. Apr 21st, 2026

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ మరియు మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో ‘వీరసింహా రెడ్డి’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మరో క్రేజీ ప్రాజెక్ట్ సిద్ధమవుతోంది. NBK111 వర్కింగ్ టైటిల్‌తో రూపొందనున్న ఈ యాక్షన్ డ్రామా తాజాగా సెట్స్ పైకి వెళ్లినట్లు తెలుస్తుంది.

ఈ సినిమాలో హీరోయిన్ల విషయంలో ఒక ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే నయనతార పేరు ప్రముఖంగా వినిపిస్తుండగా, తాజాగా కాజల్ అగర్వాల్ కూడా ఈ ప్రాజెక్టులో భాగం కానున్నట్లు సమాచారం. గతంలో బాలయ్యతో కలిసి ‘భగవంత్ కేసరి’లో నటించిన కాజల్, మరోసారి ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోబోతుండటం విశేషం.

వృద్ది సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తుండగా, హీరోయిన్ల విషయమై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

The put up బాలయ్య కోసం నయనతారతో పాటు ఆమె కూడానా..? first gave the impression on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.