ప్రస్తుతం మన టాలీవుడ్ సీనియర్ స్టార్ నటులు తమదైన ఫామ్ లో కొత్త సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య తన 111వ సినిమాతో బిజీగా ఉన్నారు కానీ తనకి చిన్న గాయం అయ్యి ఇప్పుడు రెస్ట్ లో ఉన్నారు. అయితే ఈ సినిమాతో పాటుగా మెగాస్టార్ చిరంజీవి మరోపక్క తన 158వ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
భారీ అంచనాలు ఉన్న ఈ ప్రాజెక్ట్ కి బాలయ్య ప్రాజెక్ట్ ఓ ఇంట్రెస్టింగ్ లింక్ కుదిరింది. ఇన్నాళ్లు మన సీనియర్ స్టార్ నటుల్ని దర్శకులు వింటేజ్ అంటూ పాత సినిమాల్లోలా చూపిస్తామని తెలిపారు. కానీ ఆల్రెడీ బాలయ్య సినిమాకి దర్శకుడు గోపీచంద్ మలినేని ఇక మీద వింటేజ్ లేదు న్యూ ఏజ్ అంటూ కొత్త బాలయ్యని చూపిస్తామని తెలిపారు.
ఇప్పుడు ఇదే బాటలో మెగాస్టార్ సినిమా కూడా ఉండబోతుందట. ఇందులో కూడా వింటేజ్ ట్రీట్ ఉండదట. కంప్లీట్ గా కొత్త మెగాస్టార్ నే చూడబోతున్నారని తెలుస్తుంది. సో మన సీనియర్ స్టార్స్ నుంచి ఫ్యాన్స్ కి కొత్త వెర్షన్ లు రాబోతున్నాయని చెప్పవచ్చు.
The submit బాలయ్య సినిమా బాటలోనే మెగా 158 కూడా.. ఫ్యాన్స్ కి కొత్త వెర్షన్లు! first seemed on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.
