Sat. Jul 25th, 2026
Love O Love OTT Release: థియేటర్ల నుంచి ఓటీటీలోకి ‘లవ్ ఓ లవ్’.. ధనుష్ మేనల్లుడు సినిమా ఎక్కడ చూడాలంటే?

Love O Love OTT Free up: ప్రేమ కోసం ఎంత దూరమైనా వెళ్లే ప్రేమికుల కథలు తెరపై కొత్తేమీ కావు. అయితే ప్రేమ పేరుతో అతిగా ఖర్చు, అప్పులు, ఉద్యోగం కోల్పోవడం, చివరకు ప్రేమనే ప్రశ్నించే పరిస్థితి వస్తే? అలాంటి ఆసక్తికరమైన కథాంశంతో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ‘లవ్ ఓ లవ్’ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ధనుష్ మేనల్లుడు పవిష్ నారాయణ్ హీరోగా నటించిన ఈ మూవీ థియేటర్లలో విడుదలైన మూడు వారాలకే డిజిటల్ స్ట్రీమింగ్‌లోకి వస్తుండటం విశేషం.

ధనుష్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నిలవుక్కు ఎన్‌మేల్ ఎన్నడి కోబం’ (NEEK) సినిమాతో హీరోగా పరిచయమైన పవిష్ నారాయణ్, తాజాగా ‘లవ్ ఓ లవ్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కొత్త దర్శకుడు మాగేష్ రాజేంద్రన్ తెరకెక్కించిన ఈ రొమాంటిక్ కామెడీ 2026 జూలై 10న తమిళం, తెలుగులో థియేటర్లలో విడుదలైంది. యువతను ఆకట్టుకునే కథాంశంతో వచ్చిన ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ లభించినప్పటికీ, ఇప్పుడు ఓటీటీలో యూత్ ని మరో సారి అలరించేందుకు సిద్ధమవుతోంది.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

ఈ మూవీ 2026 జూలై 31 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని దర్శకుడు సెల్వరాఘవన్ తన సోషల్ మీడియా ఖాతా ఆఫీషియల్ గా ప్రకటించారు. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో కూడా సినిమా అందుబాటులోకి రానుంది. థియేటర్లలో చూడలేకపోయిన వారికి ఇది మంచి అవకాశం కానుంది.

సినిమా కథ

ఈ స్టోరీ రఘువరన్ అనే యువకుడి చుట్టూ తిరుగుతుంది. దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన అవంతికను ప్రేమించే అతను, ఆమెను సంతోషంగా ఉంచాలనే ఆలోచనతో తన ఆర్థిక స్థోమతకు మించి ఖర్చు చేస్తూ వెళ్తాడు. ఖరీదైన బహుమతులు కొనడం, క్రెడిట్ కార్డులు పూర్తిగా వినియోగించడం, భారీ అప్పుల్లో కూరుకుపోవడం, చివరకు ఉద్యోగం కోల్పోవడం వరకు పరిస్థితి దిగజారుతుంది. తన కష్టాలకు ప్రేమికురాలే కారణమని భావించిన రఘువరన్, పోలీస్ స్టేషన్‌లో జరిగిన సంఘటనల తర్వాత తీసుకునే నిర్ణయాలు కథను ఆసక్తికర మలుపుల్లోకి తీసుకెళ్తాయి.

కథలో కీలకమైన ట్విస్ట్‌గా క్రేజీ గా సాగుతుంది. రఘువరన్ ఎదుర్కొన్న ఆర్థిక ఒత్తిడిని అవంతిక కూడా అనుభవించాలని ఒక ఒప్పందం కుదరడంతో, ఇద్దరూ ఒకరి పరిస్థితిని మరొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. ప్రేమ అంటే కేవలం బహుమతులేనా? లేక పరస్పర అవగాహన, బాధ్యత కూడా అవసరమా? అనే ప్రశ్నకు సమాధానం వెతికే ప్రయత్నమే ఈ సినిమా.

తారాగణం 

ఈ మూవీలో పవిష్ నారాయణ్‌కు జోడీగా తెలుగు ఫోక్ డ్యాన్సర్, గాయని నాగ దుర్గ నటించారు. కీలక పాత్రల్లో సెల్వరాఘవన్, కె.ఎస్. రవికుమార్, వనితా విజయ్‌కుమార్, రమ్య, అశ్వత్, ఆదిత్య కతిర్ తదితరులు కనిపిస్తారు. చిత్రానికి సంగీతం ఫాక్సన్ అందించగా, సినిమాటోగ్రఫీని పి.జి. ముత్తయ్య, ఎడిటింగ్‌ను ఎన్.బి. శ్రీకాంత్ నిర్వహించారు. దినేష్ రాజ్, జి. ధనంజయన్ నిర్మించిన ఈ చిత్రం థియేటర్లలో ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయినా, ఫ్యామిలీ ఆడియన్స్, యూత్ కు దగ్గరైన కథతో ఓటీటీలో మంచి ఆదరణ పొందుతుందా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.